కాజల్‌ని క్యాష్‌తో కొట్టాడు!

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందే ‘నేనో రకం’ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటించడం లేదని, ఆమెని బల్క్‌ డేట్స్‌ అడిగితే కుదదరని చెప్పిందని, తనకి వేరే కమిట్‌మెంట్స్‌ ఉండడంతో ఈ చిత్రాన్ని వదులుకుందని…

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రూపొందే ‘నేనో రకం’ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటించడం లేదని, ఆమెని బల్క్‌ డేట్స్‌ అడిగితే కుదదరని చెప్పిందని, తనకి వేరే కమిట్‌మెంట్స్‌ ఉండడంతో ఈ చిత్రాన్ని వదులుకుందని వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతోందని కూడా చెప్పుకున్నారు. 

కానీ ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా ఫిక్స్‌ అయిపోయిందని తెలిసింది. నిజంగానే ఆమెకి డేట్స్‌ సమస్యలు ఉన్నా కానీ బల్క్‌ డేట్స్‌ కోసం కాజల్‌కి ఎక్స్‌ట్రా ప్యాకేజ్‌ ఇవ్వడానికి నిర్మాత బండ్ల గణేష్‌ సై అన్నాడట. ఈమధ్యే అవకాశాల కోసం తన పారితోషికం తగ్గించుకున్న కాజల్‌ ఇప్పుడు నిర్మాతే ఎక్కువ ఇస్తానంటే కాదనలేకపోయిందట. 

బల్క్‌ డేట్స్‌ ఇవ్వడానికి ఇంతకుముందు అడ్డొచ్చిన డేట్స్‌ క్లాష్‌లు ఇప్పుడు క్యాష్‌తో కవర్‌ అయిపోయాయన్నమాట. హీరోయిన్ల కొరతని సమంత, కాజల్‌, శృతి, తమన్నా సూపర్‌గా క్యాష్‌ చేసేసుకుంటున్నారిలా.