గోల్డెన్ డేస్‌లో నటించిన గ్లామర్ స్టార్ గీతాంజలి బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే మాస్ ఆడియన్స్‌ను గిలిగింతలు పెట్టిన ఆవిడ 1961లో ‘శ్రీ సీతారాముల కళ్యాణం’ చిత్రంతో అరంగేట్రం చేసి, తోటలో పిల్ల కోటలో రాణి, డాక్టర్ చక్రవర్తి, దేవత, బొబ్బిలియుద్ధం మొదలు నేటి ‘భాయ్’, ‘గ్రీకువీరుడు’, ‘మాయాజాలం’, ‘పచ్చతోరణం’ లాంటి చిత్రాల్లో నటిస్తూ నేటికీ ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా వున్న గీతాంజలి, నటుడు రామకృష్ణను పెళ్ళాడిరది.
ఆయన చనిపోయాక హైద్రాబాద్ షిఫ్ట్ అయిన గీతాంజలి తన కెరీర్‌లో వందల చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా కమెడియన్ పద్మనాభంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ రోజుల్లోనే స్పీడ్‌గా డాన్సులు చేస్తూ, స్కిన్ టైట్ కాస్ట్యూమ్స్‌తో గ్లామర్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న గీతాంజలి తన కొడుకుని హీరో చెయ్యాలనుకుందిగానీ పరిస్థితులు సహకరించలేదు.
ఇప్పటికీ ఎలాంటి పాత్ర ఇచ్చినా తన నటనతో మెప్పించే గీతాంజలి దగ్గర పాత సినిమాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఎన్నో వున్నాయట. గొప్ప గొప్ప హీరోలతో, హీరోయిన్స్‌తో తెర బంధాన్ని పంచుకున్న గీతాంజలి 50 ఏళ్ళ సినిమా చరిత్రకు సజీవ సాక్ష్యం.