కమెడియన్ ఆలీ స్పాంటేనియస్ మాటలతో భలే జోకులేస్తుంటాడు.కామెడీ పుట్టిస్తుంటాడు. కానీ అప్పుడప్పుడు శృతిమించి, బూతులు వినిపిస్తుంటాడు. డబుల్ మీనింగ్ లతో ఝలక్ లు ఇస్తుంటాడు. నిన్నటికి నిన్న సన్నాఫ్ సత్యమూర్తి అడియో ఫంక్షన్ లో అదే జరిగింది.
అల్లు అరవింద్ ఎక్కడ నొక్కాలి..ఎక్కడ నొక్కాలి అంటున్నారు..నన్ను అడిగారు కాబట్టి సరిపోయింది..సుమను అడిగివుంటే…అంటూ డైలాగ్ వేసాడు. సుమ అనుభవజ్ఞురాలు కాబట్టి, ‘దేవుడా..’అనేసి పరిస్థితిని లైట్ చేసింది. త్రివిక్రమ్ సైతం రెండు చేతుల్తో మొహం కప్పుకున్నాడు ఆ డైలాగ్ విని.
అయితే ఈ ఎపిసోడ్ అక్కడితో అయిపోలేదని, ఫంక్షన్ అయిన తరువాత, సుమ, ఆలీ ఎదురు పడినపుడు, ప్లీజ్ నా దగ్గర అలాంటి డైలాగులు వేయకండి..అని మెత్తగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. సుమ, ఆలీ కలిసి చాలా సార్లు ఏంకరింగ్ చేసారు. ఇద్దరి మధ్య మంచి మాటల జోరు వుంది. అయితే ఇలాంటి వెకిలి మాటలు ఆలీ తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్లతో మాట్లాడేటపుడు.