సినిమా విజయం అయితే గప్ చుప్ గా లాభాలు నొల్లుకునే పంపిణీదారులు, కొనుగోలు దారులు, తేడావస్తే గగ్గోలు పెట్టడం కామన్ అయిపోయింది. ఇది తమిళనాట మరీనూ. ముఖ్యంగా రజనీ సినిమాలపై ఈ గడబిడ ఎక్కువైంది. పరువు కోసమో, మరెందుకనో రజనీ డబ్బులు సర్దుబాటు చేస్తాడనే ఎమోషనల్ ఫైట్ వ్యవహారం ఇది.
నిజానికి రజనీ సినిమా..ఇంత అని చెబితే..కొనమని పంపిణీ దారులను ఎవరు బలవంత పెట్టారు. ఆశలకు పోయి, పోటీలకు పోయి, ఎక్కువ పెట్టి కొన్నది వారు..దెబ్బతిన్నది వారు. అందుకే ఈ సారి రజనీ నేరుగా ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని అనుకుంటున్నాడట.
తన పరువును బజారుకు ఈడుస్తున్న వారిపై తానే కేసు వేయాలనుకుంటున్నాడట. తనకు సినిమా బిజినెస్ కు సంబంధం ఏమిటని? ఇదంతా రాజకీయం అని రజనీ అంటున్నాడట. ఇకనైనా పంపిణీదారులు హీరోను బట్టి కాకుండా, బిజినెస్ ను బట్టి సినిమాలు కొనడం అలవాటు చేసుకుంటారేమో?