కమెడియన్‌గా అలీ గురించి కొత్తగా చెప్పేదేముంది.? బాల నటుడిగా సినిమాల్లోకొచ్చిన అలీ, ఇప్పుడు సీనియర్ కమెడియన్. వెండి తెరపై నవ్వులు పండిరచిన అలీ, బుల్లితెరపైనా నవ్వులు పంచడంలో బిజీ బిజీ అయిపోయాడు. పలు టీవీ ఛానల్స్‌లో అలీ ప్రోగ్రామ్స్‌కి ఇప్పుడు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. అలీకి వున్న క్రేజ్ అలాంటిది.
ఇక, తనదైన మాస్ కామెడీ పంచ్లతోపాటు, క్లాస్ పంచ్‌లు కూడా పేల్చుతూ ఆయా ప్రోగ్రామ్స్‌ని రక్తి కట్టిస్తున్నాడు అలీ. తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో ‘సెల్ఫీ’లపై అలీ పంచ్‌లు కడుపుబ్బా నవ్వించాయి బుల్లితెర వీక్షకుల్ని. స్మార్ట్ ఫోన్ల ట్రెండ్‌లో సెల్ఫీల గురించి తెలియనిదెవరికి.? బాత్రూమ్లో స్నానం చేస్తూ సెల్ఫీలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకునే రోజులు దాపురించేశాయి.
జిడ్డు మొహంతో సెల్ఫీలు, అర్థం పర్థం లేని యాంగిల్స్‌లో సెల్ఫీలు.. నెటిజన్లను కొంత ఉర్రూతలూగించేస్తోంటే, ఇంకొంత చిరాకు తెప్పిస్తున్నాయి. చేతిలో ఓ ట్యాబ్ పెట్టుకుని సెల్ఫీల్ని ఇక్కడ, అక్కడ తీసేసుకుంటున్నారంటూ అలీ వేసిన పంచ్‌లకి, ఆ కార్యక్రమానికి హాజరైన యువత కూడా ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు ఎంత ప్రమాదకరమన్న విషయమై మీడియాలో రోజుకో కథనం చూస్తున్నా.. సెల్ఫీల ట్రెండ్ నుంచి యువత బయటపడ్డంలేదాయె.
ఇక, సీనియర్ నటుడు సురేష్, యాంకర్ అనసూయపై అలీ వేస్తోన్న పంచ్‌లకు ఈలలు గోలలు.. దటీజ్ అలీ.