రవితేజ తన సినిమాలను తానే డైరక్ట్ చేసుకుంటున్నాడా? ఇటీవల కృష్ణానగర్ ఈ తరహా గుసగుసలు వినిపిస్తున్నాయి. పవర్ సినిమాకు బాబికి అందుకే అవకాశం ఇచ్చాడట. బలుపు సినిమా టైమ్ లో కథ చెబితే, సరే అని అవకాశం ఇచ్చి, సీనియర్ కో డైరక్టర్లను పెట్టి తానే అంతా చూసుకున్నాడని టాక్. ఆ సినిమా రవితేజ కనీసం పది పదిహేను సార్లు అయినా చూసి, మార్పులు చేర్పులు చేప్పాడట.
ఇప్పుడు అలాగే సంపత్ నందిని తీసుకున్నాడంటున్నారు. ఎందుకంటే తను ఎలా చెబితే అలా వింటాడు కాబట్టి. లైన్, స్క్రిప్ట్ తెస్తే చాలు మిగిలినవి తాను సమకూర్చడం, చూడడం చేసుకోగలనని రవితేజ ధీమాగా తెలుస్తోంది. రవితేజ చాలా కాలంపాటు దర్శకత్వ శాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ అనుభవం చాలా వుంది అతనికి.