Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లరి నరేష్-థ్రిల్లింగ్ కామెడీ

అల్లరి నరేష్-థ్రిల్లింగ్ కామెడీ

అల్లరి నరేష్ సినిమాలకు పెద్దగా కథ అక్కరలేదు. కానీ కామెడీ మాత్రం బోలెడంత కావాలి. అల్లరి అన్ లిమిటెట్ అన్నట్లు వుండాలి. కానీ ఈ మధ్య పెద్ద హీరోలే బోలెండత అల్లరి చేసేస్తునండడంతో, నరేష్ కాస్త వెనకబడ్డాడు. 

లేటెస్ట్ గా తన మార్కు సినిమాతో మళ్లీ జనం మందుకు వస్తున్నాడు. అదే బంగారు  బుల్లోడు. ఆ సినిమా ట్రయిలర్ ఇప్పుడు బయటకు వదిలారు. 

అమ్మలక్కలు అంతా బాంక్యులో దాచుకున్న నగలేసుకుని, ఎవరైనా అమ్మడు అదే అమ్మలక్కల ముందుకు వస్తే ఎలా వుంటుంది? కావాల్సినంత కంగారు, కామెడీ. 

కదిలే బంగారుదుకాణంలాంటి అమ్మాయి కనిపిస్తే చటుక్కున మాయం చేస్తే ఏమవుతుంది. బోలెడంత సస్సెన్స్..ఆపై థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్.

ఈ రెండూ కలిసి బంగారుబుల్లోడు సినిమా తయారుచేసినట్లు కనిపిస్తోంది. నరేష్, పూజా జవేరిలతో పాటు బోలెండంత మంది తెలుగు కమెడియన్లు వున్న ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర. కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ గిరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?