అల్లరోడి ‘సెల్ఫీ’ కథలు

అల్లరి నరేష్‌ తాజా చిత్రం 'సెల్ఫీ రాజా' ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వెరైటీగా తన సినిమాలోని పాటల్ని ఒకటొకటిగా విడుదల చేస్తున్నాడు అల్లరి నరేష్‌. ఏం చేసినా వెరైటీగా ప్లాన్‌ చేయడం అనేది ఇలాంటి…

అల్లరి నరేష్‌ తాజా చిత్రం 'సెల్ఫీ రాజా' ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వెరైటీగా తన సినిమాలోని పాటల్ని ఒకటొకటిగా విడుదల చేస్తున్నాడు అల్లరి నరేష్‌. ఏం చేసినా వెరైటీగా ప్లాన్‌ చేయడం అనేది ఇలాంటి విషయాల్లోనే. కాన్సెప్ట్‌ల పరంగా 'కొత్తదనం' జోలికి వెళ్ళడంలేదీ కామెడీ హీరో. అదేమని అడిగితే, 'ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలి.. నా నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నది అదే' అంటాడు అల్లరి నరేష్‌. 

'సెల్ఫీ రాజా' విశేషాల గురించి చెబుతూ, సెల్ఫీల మోజును తాను తప్పు పట్టలేననీ, అలాగే తన సినిమా కారణంగా సెల్ఫీ మోజు నుంచి జనం బయటపడతారని అనుకోవడంలేదనీ, ఏదో సరదాకి ఆ టైటిల్‌ పెట్టామనీ అల్లరి నరేష్‌ చెప్పుకొచ్చాడు. పరమ రొటీన్‌గా అల్లరి నరేష్‌ 'సెల్ఫీ రాజా'లో ఇటీవలి కాలంలో వచ్చిన చాలా సినిమాల్లోని సన్నివేశాల్ని 'స్పూఫ్‌' చేసి పారేశాడు. 'స్పూఫ్‌ రాజా' అని అల్లరి నరేష్‌కి ఎప్పుడో బిరుదు ఇచ్చేశార్లెండి సినీ జనం, ప్రేక్షక లోకం. 

అన్నట్టు, 'సుడిగాడు' తర్వాత ఆ స్థాయిలో నవ్వించే చిత్రమవుతుందట 'సెల్ఫీ రాజా'. నమ్మొచ్చా.? ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్‌ వరుస వైఫల్యాల్ని చవిచూశాడు. పరమ రొటీన్‌ సినిమాలతో బోర్‌ కొట్టించేశాడు. చూద్దాం.. 'సెల్ఫీ రాజా'తో అల్లరి నరేష్‌ ఈజ్‌ బ్యాక్‌ అనిపిస్తాడో లేదో.!