Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అల్లు అరవింద.. రిపీట్‌!

అల్లు అరవింద.. రిపీట్‌!

అల్లు అర్జున్‌తో 'డిజె' చిత్రంలో నటించిన పూజ హెగ్డె మరోసారి అతనితో రొమాన్స్‌ చేయనుందా? తాజా వార్తలని బట్టి పూజ హెగ్డే మళ్లీ బన్నీతో జత కట్టడం ఖాయమైనట్టే అనిపిస్తోంది. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ తెరకెక్కించే లవ్‌స్టోరీకి కథానాయకి ఎవరనే విషయంపై చాలా కాలంగా సస్పెన్స్‌ నెలకొంది. కీర్తి సురేష్‌, సాయి పల్లవి తదితరుల పేర్లు కూడా వినిపించాయి.

కియారా అద్వానీ కూడా ఫ్రంట్‌ రన్నర్‌ అని చెప్పుకున్నారు. అయితే హీరోయిన్లని మళ్లీ మళ్లీ రిపీట్‌ చేసే అలవాటున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన గత చిత్రం 'అరవింద సమేత'లో నటించిన పూజ హెగ్డేని మళ్లీ రిపీట్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడట. పూజ హెగ్డే డేట్స్‌ కూడా అనుకూలంగా వుండడంతో ఆమె ఈ చిత్ర కథానాయకిగా దాదాపు ఖాయమైనట్టే అంటున్నారు.

ఈమధ్య తన సినిమాలు అండర్‌ పర్‌ఫార్మ్‌ చేస్తూ వుండడంతో, ఫ్యామిలీ చిత్రాలకి గిరాకీ బాగుండడంతో, తన స్టయిల్లో ఒక వినోదాత్మక కుటుంబ కథా చిత్రం చేద్దామని త్రివిక్రమ్‌కి అల్లు అర్జున్‌ చెప్పగా, 'నువ్వు నాకు నచ్చావ్‌' తరహా కథని త్రివిక్రమ్‌ తీర్చిదిద్దుతున్నాడట. బౌండ్‌ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళ్లాలని ఫిక్స్‌ అయి ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా స్టార్ట్‌ చేయలేదు.

స్టార్‌ కాస్ట్‌, టెక్నికల్‌ టీమ్‌ అంతా ఫిక్స్‌ అయిపోయాక ఈ చిత్రం మార్చి లేదా ఏప్రిల్‌లో మొదలు కానుందని సమాచారం.

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?