Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'అలా' పవన్ కల్యాణ్ స్థానంలోకి రజనీకాంత్!

మెగా హీరోల లిస్ట్ చెప్పమంటే ఎవరైనా చిరంజీవి నుంచి స్టార్ట్ చేస్తారు. రెండో పేరు ఆటోమేటిగ్గా పవన్ కల్యాణ్ దే ఉంటుంది. కాంపౌండ్ లో క్రేజ్ పరంగా చిరు తర్వాత స్థానం పవన్ దే. ఎవ్వరూ కాదనలేని నిజం ఇది. ఆ కాంపౌండ్ హీరోలు మాట్లాడేటప్పుడు కూడా వరుస క్రమంలో ఈ రెండు పేర్లు చెప్పిన తర్వాతే మిగతా హీరోల్ని ప్రస్తావిస్తారు. కానీ బన్నీ ఈ లిస్ట్ ఎప్పుడో మార్చేశాడు. చెప్పను బ్రదర్ అంటూ చాన్నాళ్ల కిందటే పవన్ ను సైడ్ చేయడం స్టార్ట్ చేసిన అల్లు అర్జున్, తాజాగా మరో అడుగు ముందుకేసి తన లిస్ట్ నుంచి పవన్ ను తీసేసి రజనీకాంత్ కు స్థానం ఇచ్చాడు. 

అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ లో మాట్లాడిన బన్నీ.. తనను చిరంజీవి అభిమానిగా చెప్పుకున్నాడు. "ఈ కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యానే" అంటూ పెద్ద డైలాగ్ కూడా కొట్టాడు. ఇక్కడి వరకు ఓకే. ఆ తర్వాతే బన్నీ టోన్ మారిపోయింది. చిరు తర్వాత తనకు ఇష్టమైన వ్యక్తి అంటూ చిన్న పాజ్ ఇచ్చాడు బన్నీ. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన మాటల్లోనే...

"నాకు చిరంజీవి గారంటే ప్రాణం.  ఈ కట్టె కాలేంత వ‌ర‌కు చిరంజీవిగారి అభిమానినే. చిరంజీవిగారి త‌ర్వాత నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి ర‌జినీకాంత్‌ గారే. అలాంటి ర‌జినీకాంత్‌ గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌ గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి  ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను."

చూశారుగా.. ఇది బన్నీ వెర్షన్. కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ పేరును పదేపదే చెప్పిన అల్లు అర్జున్.. కొన్నాళ్లుగా పవన్ పేరు ప్రస్తావించడం మానేశాడు. ఒక దశలో "చెప్పను బ్రదర్" అంటూ పవన్ ఫ్యాన్స్ పై చిరాకు పడ్డాడు కూడా. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఓ 2 సార్లు పవన్ ను బన్నీ కౌగిలించుకునే పరిస్థితులు వచ్చాయి. దీంతో ఇద్దరూ కలిసిపోయారని అనుకున్నారంతా.

కానీ రాత్రి జరిగిన ఫంక్షన్ తో బన్నీ మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. తనకు పవన్ ఫ్యాన్స్ అక్కర్లేదనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఈవెంట్ లో ఒకానొక సందర్భంలో పవర్ స్టార్.. పవర్ స్టార్ అనే నినాదాలు వినిపించినప్పటికీ బన్నీ వినిపించుకోలేదు. "అందర్నీ రౌండ్ వేస్తా బ్రదర్, కాస్త ఆగు" అని మాత్రమే అన్నాడు. ఆ తర్వాత పవన్ స్థానంలో రజనీకాంత్ పేరు చెప్పి చిన్న షాక్ ఇచ్చాడు.

రెండు సినిమాలు త‌ప్పకుండ హిట్ అవుతాయి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?