అమరావతిపై లోకేష్‌కి అంత అత్యుత్సాహమేల.!

రాజధాని అమరావతి పరిధిలో పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా తేలిగ్గానే గెలిచేయొచ్చని అనుకున్న నారా లోకేష్‌కి, మంగళగిరి నియోజకవర్గ ప్రజానీకం పెద్ద షాకే ఇచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందనీ, వైఎస్సార్సీపీ రిగ్గింగులకు పాల్పడిందనీ.. నానా యాగీ…

రాజధాని అమరావతి పరిధిలో పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా తేలిగ్గానే గెలిచేయొచ్చని అనుకున్న నారా లోకేష్‌కి, మంగళగిరి నియోజకవర్గ ప్రజానీకం పెద్ద షాకే ఇచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందనీ, వైఎస్సార్సీపీ రిగ్గింగులకు పాల్పడిందనీ.. నానా యాగీ చేసిన లోకేష్‌కి, 'తత్వం' ఇప్పటికీ 'బోధపడి' వుండదని ఎలా అనుకోగలం.? రాజకీయాల్లో గెలుపోటములు సహజమనుకోండి.. అది వేరే విషయం.

కానీ, ఓడిపోయాక.. మళ్ళీ ప్రజలకు చేరువయ్యేందుకు ఏం చేయాలో తెలుసుకోవడం నాయకుడి లక్షణం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మళ్ళీ అధికారం కోసం నానా తంటాలూ పడుతున్నారు. తనయుడు నారా లోకేష్‌ మాత్రం, తెలుగుదేశం పార్టీని రోజురోజుకీ ముంచేసేందుకు తనవంతు కృషి చేస్తూనే వుండడం గమనార్హం.

టీడీపీని వీడుతున్నవారిలో చాలామంది చేసే అతి సాధారణమైన కంప్లయింట్‌.. నారా లోకేష్‌ వ్యవహారశైలి మీదనే. ఇక, రాజధాని అమరావతి విషయంలో నారా లోకేష్‌ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. తాజాగా లోకేష్‌ నోట 'ఆణిముత్యం' లాంటి డైలాగు ఒకటి వచ్చింది. 'విశాఖపట్నంను రాజధానిగా ఎవరూ కోరుకోలేదు.. అక్కడి ప్రజలే విశాఖను రాజధానిగా వద్దంటున్నారు..' అని సెలవిచ్చారు ఈ రోజు.

వావ్‌, ఇలాంటి ఐడియాలు నారా లోకేష్‌కి ఎలా వస్తాయో ఏమో.! కర్నూలు ప్రజానీకం హైకోర్టును వద్దంటారా.? విశాఖ ప్రజానీకం రాజధానిని వద్దంటారా.? ఇదెక్కడి చోద్యం.?నిజానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోతున్న సమయంలోనే ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ కాస్త తక్కువ టోన్‌తోనే అయినా, తమ ప్రాంత అభివృద్ధి గురించిన నినాదాలు జోరుగా విన్పించాయి.

ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తోపాటు, ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్‌ కూడా తెరపైకొచ్చింది. వాటితోపాటుగా కర్నూలు రాజధాని, విశాఖ రాజధాని.. అనే డిమాండ్లూ గట్టిగా విన్పించిన విషయం విదితమే. ఇక, టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా డిసైడ్‌ చేసిన క్రమంలో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ తీవ్ర నిరాశకు గురయ్యాయి.

ఉత్తరాంధ్ర ప్రజల గొంతునీ, రాయలసీమ ప్రజల గొంతునీ నొక్కేశారు అప్పట్లో చంద్రబాబు. ఆ ప్రాంత నాయకులు కొందరు గళం విప్పే ప్రయత్నం చేస్తే, వారినీ లైట్‌ తీసుకున్నారు. ప్రస్తుతంలోకి వస్తే, గంటా శ్రీనివాసరావు ఇంకా టీడీపీ ఎమ్మెల్యేనే కదా.. ఆయనెందుకు విశాఖను రాజధానిగా సమర్థిస్టున్నట్లు.? మరికొందరు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలదీ ఇదే వాదన. పార్టీలో నేతలేమనుకుంటున్నారో తెలుసుకోలేని స్థితిలో వున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, టీడీపీని మరింతగా ముంచేయాలనే డిసైడ్‌ అయినట్లున్నారు. అవును మరి, ఉత్తరాంధ్ర నుంచి టీడీపీకి వ్యతిరేకంగా ఉద్యమం రావాలన్నట్టుంది ఆయన వ్యవహార శైలి.