స్టార్‌గా తన రేంజ్‌ని ‘రేసుగుర్రం’తో పెంచేసుకున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాల విషయంలో సర్‌ప్రైజింగ్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్‌తో చేస్తున్న సినిమా తర్వాత బన్నీ మరో రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అందులో ఒకదానికి బోయపాటి శ్రీను దర్శకుడైతే, మరోటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఉంటుందని టాక్.
బోయపాటి శ్రీను సినిమాలంటే ఎలా ఉంటాయనేది ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. అచ్చమైన మాస్ సినిమాలు తీసే బోయపాటి సరాసరి బి, సి సెంటర్స్ ఆడియన్స్‌లోకి తన హీరోని తీసుకెళ్లిపోతాడు. అదే అతని విజయ రహస్యం. బన్నీ ఇంతవరకు అలాంటి పక్కా మాస్ సినిమా చేయలేదు. బద్రినాథ్ మినహా బన్నీ చేసిన మాస్ ప్రయత్నాలు లేవు.
బోయపాటితో మాస్ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్… తర్వాత ప్యూర్ క్లాస్ మూవీ చేయడానికి ఫిక్స్ అయ్యాడట. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా. ఇటు అన్ని వర్గాల వారిని అలరించే త్రివిక్రమ్ సినిమా తర్వాత అటు మాస్‌ని, క్లాస్‌ని విడివిడిగా కవర్ చేసే దర్శకులతో ఒప్పందాలు చేసుకుని బన్నీ అన్నీ రౌండ్ ఆఫ్ చేసేస్తున్నాడు.. ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు.