ధనరాజ్…ధనలక్ష్మి

మరో హాస్య నటుడు హీరో అయిపోవడానికి రెడీ అయిపోయాడు. నిజానికి ఇంతకు ముందే తాగుబోతు రమేష్ తో కలిసి ఓ సినిమా చేసేసాడు. ఎవరో కాదు ధన్ రాజ్,. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో,…

మరో హాస్య నటుడు హీరో అయిపోవడానికి రెడీ అయిపోయాడు. నిజానికి ఇంతకు ముందే తాగుబోతు రమేష్ తో కలిసి ఓ సినిమా చేసేసాడు. ఎవరో కాదు ధన్ రాజ్,. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో, ఈటీవీలో  జ‌బ‌ర్‌ద‌స్త్ కార్యక్రమంతో కాస్త పేరు సంపాదించుకున్నాడు ధనాధన్  ధ‌న్‌రాజ్‌. 

అందుకే ధనరాజ్ ను హీరోను చేయాలని డిసైడ్ అయిపోయాడు ఓ కొత్త ద‌ర్శకుడు. `ధ‌న‌ల‌క్ష్మి త‌లుపు త‌డితే` అనేది సినిమా పేరు. ఈ మధ్యనే మంచు లక్ష్మి సినిమా పిలవని పేరంటం నుంచి అనివార్య కారణాల వల్ల బయటకు వచ్చి వార్తల్లోకెక్కాడు ధన్ రాజ్. 

ఆ కసితోనే ఈ సినిమా ఓకె అన్నాడో, లేక ఎలాగైనా హీరో అనిపించుకోవాలనుకున్నాడో మరి. అయినా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. బి, సి సెంటర్లలో జబర్ధస్త్ టీమ్ కు కాస్త ఫాలోయింగ్ వుంది మరి.