ఇటీవల మెగాభిమానులు చాలా వరకు బన్నీ, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ అంటూ విడిపోయిన సంగతి తెలిసిందే. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా, సామాజిక మాధ్యమాల సాక్షిగా ఇది నిజం. బన్నీ టీజర్ కు పవర్ స్టార్ అభిమానులు డిజ్ లైక్ లు కొట్టడం, పవర్ స్టార్ ట్రయిలర్ కు బన్నీ అభిమానులు డిజ్ లైక్ లు కొట్టడం జరిగింది కూడా.
ఈ ఎఫెక్ట్ మెగా హీరోల సినిమాల మీద కూడా చూపిస్తోంది. గతంలో ఆ మాత్రం, ఈ మాత్రం బాగుంటే చాలు, ఫ్యాన్స్ అంతా కలిసి సినిమాను లాగించేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి సీన్ లేదు. మెగా సినిమాలకు మెగాభిమానుల్లోనే బ్యాడ్ ప్రాపగండా స్ప్రెడ్ అవుతోంది. సాయి ధరమ్ తేజ విన్నర్, పవన్ కాటమరాయుడుల మీద కొంత వరకు పడింది.
అందుకే ఇప్పుడు ఈ వ్యవహారానికి చెక్ పెట్టాలని మెగా హీరోలే భావిస్తున్నట్లున్నారు. ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఫంక్షన్ జరిగింది అభిమానుల సమక్షంలో. దీనికి వచ్చారు హీరో సాయి ధరమ్ తేజ. ఆయన అక్కడ అదే అపీల్ చేసారు. మెగాభిమానులు అంతా కలిసి వుండాలని. కలసి వుంటేనే బలమని, మెగాభిమానుల అంతా కలిసి వుంటే మరెవ్వరు ఏమీ చేయలేరని. అది మాత్రం నిజమే. కానీ ఆ మాట సాయి ధరమ్ చెప్పడం కన్నా, పవన్-బన్నీ ఒక్క వేదికపై వచ్చి అభిమానులతో చెబితే దాని ఇంపాక్ట్ వేరుగా వుంటుంది.
అయినా అది సాధ్యమవుతుందా? బన్నీని చూసి కొణిదెల ఫ్యామిలీ జలసీ ఫీలవుతోందని గుసగుసలు వున్నాయి. అలాంటపడు ఇది కష్టం కదా?