అల్లు శిరీష్ కు ఆసిడ్ టెస్ట్

మెగా ఫ్యామిలీ నుంచి అయితే హిట్ హీరోలు లేదూ అంటే పక్కకు తప్పుకోవడం తప్ప ఏవరేజ్ అనే ముక్క లేదు. సాయిధరమ్, వరుణ్ తేజ కూడా పది నుంచి ఇరవై కోట్ల మార్కెట్ వుందని…

మెగా ఫ్యామిలీ నుంచి అయితే హిట్ హీరోలు లేదూ అంటే పక్కకు తప్పుకోవడం తప్ప ఏవరేజ్ అనే ముక్క లేదు. సాయిధరమ్, వరుణ్ తేజ కూడా పది నుంచి ఇరవై కోట్ల మార్కెట్ వుందని ప్రూవ్ చేసుకున్నారు. ఒకే ఒక్క హీరో (మెగాస్టార్ బంధువు) ఒకే ఒక సినిమా ట్రయ్ చేసి పక్కకు తప్పుకున్నారు. ఇక లైన్ లో పడడానికి స్ట్రగుల్ పడుతున్న ఒకే ఒక్క హీరో అల్లు శిరీష్. 

బన్నీ సోదరుడు. బన్నీ మేకోవర్ అయినట్లు కావాలని చూస్తున్నాడు. బన్నీ ఫేస్ స్క్రీన్ కు సూట్ కాదనుకున్నవారే ఆశ్చర్యపోయేలా మేకోవర్ అయ్యాడు. అదీ ఒక్క గెటప్ విషయంలోనే కాదు, ఏక్టింగ్, డ్యాన్స్, సబ్జెక్ట్ లు ఇలా అన్నింటా.  ఇప్పుడు అలాంటి ఎర్లీ స్టేజ్ లో వున్నాడు అల్లు శిరీష్ ఇప్పటికి రెండు సినిమాలు చేసాడు. అందులో ఒకటి మారుతి మ్యాజిక్ కాబట్టి ఓకె అయిపోయింది. బోలెడు గ్యాప్ తీసుకున్నాక పరుశురామ్ డైరక్షన్ లో శ్రీరస్తు శుభమస్తు చేసాడు. గెటప్ పరంగా మేకోవర్ అయ్యాడు చాలా వరకు. 

ఇక నటన ఎలా వుంది అన్నదానిపై ఈ సినిమా ఫలితం ఆథారపడి వుంటుంది. మరో సినిమా సెట్ మీద వుంది కానీ, ఈ సినిమా ఫలితాన్ని బట్టే శిరీష్ కెరీర్ ముందుకు వెళ్లేది లేనిదీ ఆధారపడి వుంటుంది. పరుశురామ్ మంచి డైరక్టర్. పైగా అరవింద్ కథ కథనాల విషయంలో జాగ్రత్తలు బాగానే తీసుకుంటారు. అంటే ఇక మిగిలింది అల్లు శిరీష్ బాధ్యతే. అతగాడే తనను తాను నిరూపించుకోవాలి..అందుకే శ్రీరస్తు..శుభమస్తు చిత్రం శిరీష్ కు ఆసిడ్ టెస్ట్. ఇక్కడ పాస్ కాకుంటే డాడీ అరవింద్ మీద అలిగినా, ఆగ్రహించినా ఫలితం వుండదు..