ఒకే ఒక్క పోస్టర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం టైటిల్‌తో హృదయవికారంగా కనిపించిన సంపూ బాబుని చూసి హృదయాలన్నీ గల్లంతయ్యాయి. టీజర్, ఫస్ట్ లుక్ అంటూ హడావుడి సృష్టించాడు. సంపూ బాబు ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకొన్నవాళ్లున్నా… అది మారుతికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాలేదు.
సంపూ కోసం కొత్త జంటలో ఓ పాత్ర సృష్టించాడు మారుతి. అయితే ఆ పాత్రపై ప్రేమ పెంచుకొంటూ పెంచుకొంటూ.. ఆ పాత్రని పెద్దది చేసుకొంటూ వెళ్లాడట. దాంతో సినిమా మొత్తం.. సంపూ హవానే కనిపించిందట.
ఎడిటింగ్ రూమ్‌లో సంపూ గోల చూసిన అల్లు అరవింద్… ఇది సంపూ సినిమానా? లేదంటే శిరీష్ సినిమానా? అని సందేహపడ్డాడట. ఎందుకైనా మంచిదని సంపూ క్యారెక్టర్ని ట్రిమ్ చేసేసినట్టు సమాచారమ్. ఈ సినిమాలో సంపూ నుంచి కావల్సినంత కామెడీ మారుతి పిండేశాడని చెబుతున్నారు. అదే నిజమైతే ఈ సినిమాతో మరో కమెడియన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికేసినట్టే.