మన కథానాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరుగుతోంది. రికార్డులు, విజయాలూ ఫ్యాన్స్ చూసుకొంటారు. మనం మాత్రం కలసే ఉందాం.. అంటూ భుజం భుజం కలుపుతున్నారు. మల్టీస్టారర్ సినిమాలు రావడానికి కారణం అదే. ఒక హీరో సినిమాలో మరో హీరో గొంతు వినిపించడానికీ కారణం ఇదే. టాప్ స్టార్లు సైతం వాయిస్ ఓవర్ చెప్పడానికి రెడీ అంటున్నారు.
జల్సా సినిమా కోసం మహేష్ బాబు గొంతిచ్చారు. ఓ టాప్ స్టార్ సినిమాకి మరోటాప్ స్టార్ మాట సాయం చేయడం అప్పట్లో సంచలనం. ఆ తరవాత అదే ట్రెండ్‌గా మారింది. ఈ ట్రెండ్‌ని మళ్లీ పవన్, మహేష్‌లు కొనసాగించబోతున్నారు. పవన్, వెంకటేష్ కలసి నటిస్తున్న చిత్రం ఓమైగాడ్.
ఈ చిత్రం కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు టాక్. మహేష్, పవన్ – మహేష్, వెంకీల మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే మహేష్ కూడా అడిగిన వెంటనే ఒకే చెప్పేశాడట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం త్వరలోనే విడుదల చేయనుంది.