కల్కి సినిమా తర్వాత పూర్తిగా గ్యాప్ తీసుకుంది. గర్భం దాల్చడంతో ఆ సినిమా ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. అలా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అమ్మతనానికే పరిమితమైన దీపిక పదుకోన్… ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. రేపోమాపో ఆమె సెట్స్ పైకి కూడా రాబోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె రీఎంట్రీకి ఊహించని స్పీడ్ బ్రేకర్ పడింది.
తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది దీపిక పదుకోన్. సవ్యసాచి ముఖర్జీ 25వ వార్షికోత్సవానికి షో-స్టాపర్‌గా హాజరైన ఆమె.. డిజైనరీ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేసింది. అదే ఇప్పుడామెకు చిక్కులు తెచ్చిపెట్టింది.
ర్యాంప్ పై దీపిక పదుకోన్ ను ఆ దుస్తులు, అలాంటి మేకప్ లో చూసిన జనం పూర్తిగా నిరాశచెందారు. చాన్నాళ్ల తర్వాత బయటకొచ్చిన ఆమె తన అందంతో ఎట్రాక్ట్ చేస్తుందని భావిస్తే.. తెల్లటి దుస్తులు ధరించి అదో రకంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సూపర్ మోడల్ అయిన దీపికను ఇంత దారుణంగా చూపిస్తారా అంటూ ఒకరు ఆవేదన వ్యక్తం చేయగా.. మరొకరు వయసుమళ్లిన మడొన్నాలా ఉందన్నారు. బామ్మలు చలి కోటు ధరించినట్టు ఆ డిజైన్ ఉందని ఒకరు విమర్శించగా.. దీపిక క్రేజ్ ను నాశనం చేశారని మరికొందరు కామెంట్ చేశారు.
ఈ విమర్శల్లో తప్పేం లేదు. దీపిక నిజంగానే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. దుస్తులు, హెయిల్ స్టయిల్, మేకప్, అద్దాలు.. ఇలా ఏదీ ఆమె రీఎంట్రీని సూచించేలా లేవు. ఈ ఫొటోలు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. సుమతీ.. ఏంటిలా అయిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కల్కి సినిమాలో సుమతి పాత్ర పోషించింది దీపిక. పార్ట్-2 మొత్తం ఆమె చుట్టూనే తిరగబోతోంది. ఈ ఏడాదిలోనే షూటింగ్ కూడా మొదలుబెట్టబోతున్నారు. అంతలోనే ఆమె లుక్స్ పై విమర్శలు చెలరేగాయి.
రీసెంట్ గా కల్కి-2పై అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. పార్ట్-2కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని, ఈ ఏడాది షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Rekha la undi
janalu ante nee uddesam .. neeku post chesukovadaniki andhubatulo leni still ichinandhuku feel ayyava enti