బాబోయ్.. ఆ రోజు తిరుమ‌ల‌లో మాకు డ్యూటీ వేయొద్దు!

గ‌తంలో ఎప్పుడూ ఉద్యోగుల్లో ఇలాంటి భ‌యం ఉండేది కాదు. పైగా ప్ర‌త్యేక ఉత్స‌వాల్లో విధులు నిర్వ‌ర్తించ‌డం దేవుడికి సేవ చేయ‌డంగా భావించేవాళ్లు.

తిరుప‌తి తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న టీటీడీ ఉద్యోగులు, పోలీసుల గుండెల్లో రైలు ప‌రుగెత్తిస్తోంది. టీటీడీ ఉన్న‌తాధికారులు, బోర్డు చైర్మ‌న్ల‌కు మాత్రం ఏమీ కాద‌ని, అంతిమంగా న‌ష్ట‌పోయేది తామే అని టీటీడీ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో ఏదైనా వేడుక అంటే చాలు ఉద్యోగులు భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కుంది.

ఫిబ్ర‌వ‌రి 4న తిరుమ‌ల‌లో ర‌థ‌స‌ప్త‌మి. ఈ ఉత్స‌వానికి భారీగా భ‌క్తులు వెళ్తారు. ఇందుకోసం టీటీడీ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయ‌డం స‌హ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. అయితే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి టోకెన్లు ఇచ్చే క్రమంలో తొక్కిస‌లాట చోటు చేసుకోవ‌డం, ఆరుగురు మృతి చెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెల‌రేగింది. కొంత మంది ఉద్యోగుల్ని స‌స్పెండ్ చేయ‌డం, మ‌రికొంద‌ర్ని బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే టీటీడీ చైర్మ‌న్‌, ఉన్న‌తాధికారుల‌కు మాత్రం ఏమీ కాలేదు. త‌మ‌ను బ‌లి చేసి, చేతులు దులుపుకుని బాధ్య‌త తీరింద‌ని టీటీడీ చైర్మ‌న్‌, ఉన్న‌తోద్యోగులు అనుకుంటున్నార‌ని టీటీడీ ఉద్యోగులు వాపోతున్నారు. అందుకే ర‌థ స‌ప్త‌మి సందర్భంగా బాధ్య‌త‌లు చేప‌ట్టాలంటే భ‌య‌మేస్తోంద‌ని ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ర‌థ‌స‌ప్త‌మిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 31 టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్ల‌పై క్షేత్ర‌స్థాయి స‌మీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నెల 8న తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌ను దృష్టిలో పెట్టుకుని భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే మంచి జ‌రిగితే త‌మ గొప్ప‌, ఏదైనా త‌ప్పు జ‌రిగితే ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తున్నార‌ని వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో ఎప్పుడూ ఉద్యోగుల్లో ఇలాంటి భ‌యం ఉండేది కాదు. పైగా ప్ర‌త్యేక ఉత్స‌వాల్లో విధులు నిర్వ‌ర్తించ‌డం దేవుడికి సేవ చేయ‌డంగా భావించేవాళ్లు. అయితే టీటీడీలో మారిన ప‌రిస్థితుల్లో ఉద్యోగుల్లో భ‌యాన్ని పోగొట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

3 Replies to “బాబోయ్.. ఆ రోజు తిరుమ‌ల‌లో మాకు డ్యూటీ వేయొద్దు!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.