ఒక నగరానికి ‘బ్రాండ్ ఇమేజ్’ సృష్టిస్తానని అధికారంలో ఉన్న నాయకులు అంటే గనుక.. ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త నిర్ణయాలు వస్తాయని, కొత్త ఆధునిక నగరాలు ఏర్పడుతాయని, నగర రూపకల్పనలోనే ఆధునికత, సాంకేతికత మేళవింపు జరుగుతుందని.. ఇలా రకరకాలుగా ప్రజలు ఆశలు పెంచుకుంటారు? కానీ కేవలం ప్రణాళిక లోపం వలన.. నగరంలోని అందమైన ప్రాంతాలను కూడా మురికివాడలుగా మార్చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం చేపడుతుందని గానీ, అలా జరుగుతూ ఉంటే ప్రేక్షకపాత్ర వహిస్తుందని గానీ ప్రజలు ఆశించరు. అలా జరిగితే వారు బాధపడడం, ఇబ్బంది పడడం మాత్రమే కాదు- ఆగ్రహిస్తారు కూడా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాజకీయంగా ఓనమాలు దిద్దుతున్న రోజుల్లోనే హైదరాబాదు నగరానికి ఒక బ్రాండ్ గా రూపుదిద్దుకున్న ప్రాంతాలు ఇవాళ మురికివాడల్లా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్లిప్త ధోరణి.. ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. ప్రభుత్వం తీరు, ప్రణాళిక లేని అవకతవక పాలన పోకడలపైనే ఈ వారం గ్రేట్ఆంధ్ర కవర్ స్టోరీ ‘బ్రాండ్ ఇమేజ్ ఇదేనా?’
అధికారంలోకి ఎవరు వచ్చినా సరే.. తమ ముద్ర ఉండాలని అనుకుంటారు. ఇది కేవలం– ప్రజలకు తాము ఏదో ఒకటి చేసేయాలనే కోరిక, తృష్ణ మాత్రమే కాదు. రాజకీయంగా భవిష్యత్తులో మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి అవసరమైన పునాది వేసుకోవడానికి కూడా ఇది అవసరం అని నమ్ముతారు. పరిపాలనలో తమ ముద్ర చూపించాలని అనుకోవడం చాలా మంచిది. దాని వలన.. ప్రజా సంక్షేమం– అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ కొత్త కొత్త సృజనాత్మక ఆలోచనలతో ప్రభుత్వాలు ముందుకు వెళ్లడం జరుగుతుంది. అదే సమయంలో.. ప్రధాన నగరాల మీద కూడా తమ ముద్ర చూపించాలనే తాపత్రయం కూడా ఉంటుంది. ఈ తాపత్రయం రకరకాలుగా వక్రమార్గాలు పడుతూ ఉంటుంది.
హైదరాబాదు వంటి నగరానికి ‘బ్రాండ్ ఇమేజ్ సృష్టిస్తాం’ అని రేవంత్ రెడ్డి గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ ప్రకటించినప్పుడు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాదు నగరానికి కొత్తగా ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ను సృష్టిస్తారు? అనే సందేహంతో కూడిన ఆశ్చర్యం అది. ఎందుకంటే.. హైదరాబాదు అంటేనే నాలుగువందల ఏళ్లు దాటిన మహానగరంగా దేశవ్యాప్తమైన గుర్తింపు ఉంది. ప్రపంచపటంలో కూడా హైదరాబాదుకు ఒక నిర్దిష్టమైన స్థానం ఉంది.
హైదరాబాదుకు సాంస్కృతిక వైభవ చిహ్నంగా, పెద్ద నగరాల్లో ఒకటిగా మాత్రమే కాదు… వ్యాపారాల పరంగా, ఐటీ కేంద్రంగా, సినీ నిర్మాణం పరంగా ఇంకా అనేక విధాలుగా కూడా బ్రాండ్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది. కొత్తగా ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ తయారు చేస్తారు. ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను పద్ధతిగా కాపాడుతూ.. మరింతగా.. పెంచితే చాలు కదా అనే భావన కలుగుతుంది. కానీ.. నగరానికి కొత్త బ్రాండ్ ఇమేజ్ సృష్టిస్తాం అని ప్రకటించుకునే నాయకులు.. అలాంటి ప్రకటనల ద్వారా, లేదా అలాంటి ప్రయత్నాల ద్వారా తమకు తాము బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నారనేది స్పష్టం.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నారు. హైదరాబాదు ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిన నగరం.. సింపుల్ గా చెప్పాలంటే.. ఇక్కడి నగర జీవుల జీవన ప్రమాణాలను కాపాడడం, మరింత సులువుగా మార్చడమే ఈ నగర బ్రాండ్ ఇమేజ్ ను పరిరక్షించడం అవుతుంది. కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ.. రేవంత్ రెడ్డి తన ముద్ర చూపించాలని అనుకుంటున్నారు. అందుకోసం చేస్తున్న ప్రయత్నాలే రకరకాలుగా పక్కదారి పట్టిపోతున్నాయి.
కొన్ని పాతనిర్ణయాలను గమనిస్తే.. హైటెక్ సిటీ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో ఎక్స్‌టెన్షన్ కు కేసీఆర్ ప్రభుత్వం గతంలో చర్యలు తీసుకుంది. ఈ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కాగానే దీనిని పూర్తిగా మార్చేశారు. నగరానికి రెండో చివర్న ఉండే నాగోలు నుంచి ఎయిర్ పోర్ట్ కు మెట్రో పొడిగింపుకు ప్లాన్ చేసి, అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. హైటెక్ సిటీ అనేది నగరంలో ఐటీ కేంద్రంగా స్థిరపడిన ప్రాంతం. విమానాశ్రయం వెళ్లే అవసరాలు అధికంగా ఉండే జనసాంద్రత గల ప్రాంతం అని కూడా అనుకోవచ్చు.
బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ వంటి ప్రాంతాలు కూడా ఈ వైపునే ఉంటాయి. కానీ.. ఇదేమీ పట్టించుకోకుండా.. నాగోలు ఎల్బీనగర్ చాంద్రాయణ గుట్ట, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాల మీదుగా మెట్రో పొడిగింపును ఎలా అర్థం చేసుకోవాలి? తన ముద్ర చూపించుకోవాలనే తాపత్రయం తప్ప.. ప్రజలకు నిజంగా ఉపయోగకరమా లేదా అనే దృష్టి ఉన్నట్టుగా కనిపించదు.
బ్రాండ్ ను కాపాడుతున్నారా?
హైటెక్ సిటీ అనేది హైదరాబాదునగరంలో మోస్ట్ హేపెనింగ్ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి బ్రాండ్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రీతిగా కాపాడుతోంది? అనే సందేహాలు ప్రజలకు కలుగుతుంటాయి. ప్రధానంగా.. ఐటీ కార్యాలయాలు క్రిక్కిరిసి ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో పగలు పర్యటిస్తూ ఉంటే, ఆ భవనాలను అక్కడి కార్యాలయాలను గమనిస్తూ ఉంటే.. కొత్తగా వచ్చిన వారికి ఏదో విదేశాల్లో తిరుగుతున్నాం అనే భావన కలిగినా కూడా ఆశ్చర్యం లేదు. అంతగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ అనే సామెత చందంగా.. ఇవాళ హైదరాబాదు నగరంలో హైటెక్ సిటీ బాగా అభివృద్ధి చెంది ఉన్నదంటే.. అందుకు అనేక మంది నాయకులు, అనేక పార్టీలు క్రెడిట్ తమదే అని క్లెయిమ్ చేసుకోవచ్చు.
అంతా తమ ఘనతే అని ఎందరు క్లెయిం చేసుకున్నా.. కానీ.. అభివృద్ధికి సానుకూల వాతావరణం సహజంగా లేని ఒక నగరంలో తలకిందులుగా తపస్సు చేసినా.. ఇలాంటి ఎవ్వరూ చేయలేరు అని కూడా గుర్తుచుకోవాలి. ఏదో ఒక రీతిగా, ఎవరో ఒకరి పుణ్యాన హైదరాబాదు నగరం, హైటెక్ సిటీ ప్రాంతం ఆధునికతరపు అభివృద్ధికి ఆనవాలుగా ఎదిగినదని అనుకుందాం. మరి ఆ ఆధునిక నగరాన్ని, ఆ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడంలో ప్రభుత్వం ఎంత మేర సక్సెస్ అవుతోంది. ఈ ప్రాంత జీవుల బతుకు సవ్యంగానే సాగుతున్నదా? ఎంత దుర్లభంగా మారుతున్నది? ఏయేవేళల్లో ఎంతటి దురవస్థల పాలవుతున్నారు? వారి జీవితాల్ని సులువుగా మార్చడానికి ప్రభుత్వానికి ఏమైనా పట్టింపు ఉన్నదా? లేదా? అనేది కీలకమైన అంశం.
చిన్న ఉదాహరణ తీసుకుందాం. హైదరాబాదు హైటెక్ సిటీలో ఇన్ ఆర్బిట్ మాల్ ప్రాంతం ఉంటుంది. ఆధునిక నగరంలో ఇదొక అద్భుతమైన ప్రాంతం. చుట్టూ ఐటీ కంపెనీలు, అత్యాధునిక నివాస సముదాయాలు విలసిల్లే ప్రాంతం. పగలంతా ఆ వాతావరణమే మనకు కనిపిస్తూ ఉంటుంది. పొద్దు వాలుతున్న కొద్దీ.. జీవితం దుర్భరంగా మారుతూ ఉంటుంది. కేవలం ట్రాఫిక్ నరకం ఒక్కటే కాదు. నిజానికి ఈ ప్రాంత ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కూడా. కానీ… సాయంత్రం దాటుతున్న కొద్దీ అసలు రోడ్లు అనేవే కనిపించవు.
అక్కడ ప్రతి రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు వెలుస్తుంటాయి. ఈ ప్రాంతంలో వందల దుకాణాలు సాయంత్రం వెలిసి, తెల్లవారే సరికెల్లా మాయం అవుతాయంటే చాలా తప్పు చెప్పినట్టు. హైటెక్ సిటీ మొత్తం ప్రాంతంలో వేల దుకాణాలు వెలుస్తుంటాయని అన్నప్పటికీ అతిశయోక్తి కాదు. ఈ దుకాణాలను కేవలం పేదల బతుకుతెరువుగా చూడడానికి కూడా వీల్లేదు. అలాంటి చిన్న చిన్న ధరల తోపుడు బళ్ల దగ్గరినుంచీ.. స్టార్ హోటల్ ను తలపించే ధరలతో రోడ్డు మీద వడ్డించే తిండి కార్ఖానాలు అనేకం ఇక్కడ హఠాత్తుగా సాయంత్రాలు వెలుస్తుంటాయి.
ఇక అక్కడినుంచి జాతర మొదలవుతుంది. ఆయా దుకాణాల చుట్టూ ఈగల్లా జనం ముసురుతుంటారు. నేల ఈనినట్టుగా ముసిరే జనం. తిన్నవి, వదిలేసినవి, ఆ పేపర్ ప్లేట్లు, యూజ్ అండ్ త్రో ప్లాస్టికు ప్లేట్లు ఎక్కడివక్కడ చిందరవందరగా దర్శనమిస్తూ ఉంటాయి. మొత్తంగా దేశంలోనే అత్యంత ఆధునిక నగరప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న హైదరాబాదు హైటెక్ సిటీ ప్రతి సాయంత్రమూ ఒక మురికివాడగా మారిపోతూ ఉంటుంది. విశాలంగా ఉండే రోడ్లు ఉదయం వేళల్లో ఎంతో అందంగా కనిపిస్తాయి. పగలంతా ట్రాఫిక్ తో కిటకిటలాడుతాయి. సాయంత్రం అవుతున్న కొద్దీ అసలు ఇక్కడ రోడ్డు ఉన్నదనే ఆనవాళ్లే కనిపించనంతగా దుకాణాలు వెలియడమూ, వాటి చుట్టూ జనం మూగడమూ.. ప్రతి దుకాణం చుట్టూతా ఒక చెత్త దిబ్బ తయారు కావడమూ జరుగుతూ ఉంటుంది.
ఇదే హైదరాబాదు నగరంలో ఒక టూవీలర్ వెళుతోంటే.. ఎదురుగా మరో టూ వీలర్ రావడం కూడా కష్టంగా అనిపించే ఇరుకు సందులు కలిగినటువంటి మురికి వాడలు ఉన్నాయి. అలాంటి ఇరుకు సందులలోనే కోట్లాది రూపాయల వ్యాపారాలు ప్రతి నిత్యం జరుగుతూ ఉండే.. వ్యాపారకూడళ్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంత ఘోరమైన వాతావరణం, అశుభ్రత, మురికివాడల తరహ పోకడ మనకు కనిపించదు. కానీ.. ఎంతో ఆధునికం, మోడర్న్ అని భావించే హైటెక్ సిటీ ప్రాంతం మాత్రం ప్రతి రోజూ ఘోరమైన అనుభవాలను అక్కడి ప్రజలకు పంచిపెడుతూ ఉంటుంది.
ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో దూకుడుగా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతోంది. కానీ.. వారికి హైటెక్ సిటీ బ్రాండ్ ఇమేజి కనిపించకపోవడం దారుణం. ఈ ప్రాంతానికి ఒక బ్రాండ్ ఉన్నదని, ఆ బ్రాండ్ ఇమేజిని కాపాడడం తమ ప్రభుత్వ బాధ్యత అని వారు పూర్తిగా మరచిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటారు.
హైదరాబాదు నగరానికి కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తా అని అంటూ ఉంటారు. ఆయన ఆశయాలకు సలాం కొట్టాల్సిందే. కానీ.. ఇదే నగరానికి ప్రస్తుతం ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను కాపాడే ఉద్దేశం, ఆలోచన లేకుండా.. ఆ శ్రద్ధ చూపించకుండా.. కొత్తగా ఎలాంటి బ్రాండ్ సృష్టించాలని ఆయన అనుకుంటున్నారో అర్థం కాదు.
ఫుట్ పాత్ ల మీద జనం నడిచేంత ఖాళీ మనకు కనిపించదు. కానీ చాలా తరచుగా.. పోలీసులు ఫుట్ పాత్ ల మీద వెలిసిన దుకాణాలను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఏవో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా జరుగుతూ ఉంటాయి. ఫుట్ పాత్ లను మాత్రమే కాదు కదా.. చార్మినార్, అబిడ్స్, కోఠి, బేగం బజార్, జనరల్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో కూడా రోడ్డును సగానికి పైగా ఆక్రమించేసుకుని, అసలు వాహనాలు వెళ్లడానికి అవకాశమే ఇవ్వకుండా.. వాహనాలు కదిలే ఖాళీ కూడా లేకుండా ‘మూవబుల్’ దుకాణాలు నడుపుతూ ఉంటారు.
నిజానికి ఈ ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ పోలీసు వాహనం రౌండ్లు కొడుతూనే ఉంటుంది. ఈ రోడ్డు దుకాణాలకు చక్రాలుంటాయి. పోలీసు వాహన సైరన్ వినపడగానే.. కాస్త వెనక్కి నెడతారు.. ఆ వాహనం క్రాస్ చేయగానే నడి రోడ్డు మీదికి తెస్తారు. ఇదే క్రమం. ఇలాంటి వాటిని ప్రభుత్వం ఏం చేస్తోంది?
రేవంత్ ముద్ర కూల్చివేతలే కదా?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలనలో ఈ ఏడాదికాలంలో తన ముద్ర ఏం చూపించారని అడిగితే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది కూల్చివేతల సంగతి మాత్రమే. ఎడాపెడా కూల్చవేతలు మాత్రమే రేవంత్ ముద్ర అని ఎవరైనా చెబుతారు.
ఒకవైపు కొన్ని దశాబ్దాలుగా ఉన్న నిర్మాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న రేవంత్ సర్కారు.. కొన్ని ప్రాంతాల్లో ప్రతిసాయంత్రం, మరికొన్ని ప్రాంతాల్లో ప్రతి పగలూ ప్రజాజీవనాన్ని దుర్భరంగా మారుస్తున్న దుర్మార్గపు వ్యాపారాలపై ఎందుకు దృష్టి సారించలేకపోతోంది. ఆధునికంగా తయారవుతున్న ప్రతి నివాస ప్రాంతం కూడా ఇలాంటి ఫుట్ పాత్ ఆక్రమణ వ్యాపారాల వల్ల మురికివాడలుగా మారిపోతూ ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? అనేది ప్రజలకు అర్థం కాని సంగతి.
పరిపాలన కేవలం ఒక కోణంలోనే సాగిపోయే వ్యవహారం కాదు. ఫుట్ పాత్ ఆక్రమణలను కూల్చివేయడం లేదా ఇలాంటి మురికివాడలను తయారుచేసే వ్యాపార దందాలకు చెక్ చెప్పడం అంటే.. చిరు వ్యాపారుల పొట్టకొట్టడం కాదు. ఆ రెండింటికి ఉండే వ్యత్యాసం అధికారులకు బాగా తెలుసు. ఎక్కడికక్కడ ప్రభుత్వ వర్గాలు ప్రలోభాలకు గురికాకుండా.. చిత్తశుద్ధితో పనిచేస్తే బాగుంటుంది. హైదరాబాదు నగరానికి కొత్త బ్రాండ్ ఇమేజ్ సృష్టించడం తర్వాత.. ముందు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను పదిలంగా కాపాడడం ముఖ్యం.
.. ఎల్ విజయలక్ష్మి
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Well described about the present situation and what needs to be done to HYD city.
One of the best article from you.. Keep it up madam
మన లచ్చి నుండి ఈరోజు మాంచి constructive article వచ్చిందే..
Oroti langa jaggulu
Joker kaa(m)pu pushapalu mariyu ka(a)mma pushapalu, mari velams pushpala kaalu kaduguthu, eppudu reddi pushpala kallu kadugutunnayee.mari etla maarpu vastundi? Hyderabad lo ayena vijayavadalo ayena kaa(m)pu janalu and Ka(a)mma janalu ee naakadamu aapithe nijamina vishayalu velugoloki vastayee. Eppudu GA meeda padatamuntappa, abhivruddhi ante eepushpalaku telusa??
హైదరాబాదు మీదా రేవంత్ మీదా పడ్డారెందురో?
ఇంక అన్నియ గురించి రాయడానికేం లేదు. చంద్రబాబు మీద తిడుతూ రాస్తే జనం ఊస్తారని భయం.
కో. కొ గారు ప్రతి వ్యాసం ఒకే కోణం లో చూసి పాత పాలన పీడ కలలు నెమరువేసే కంటే కొత్త పాలనపు “అమర” సుఖాన్ని ఆస్వాదించండి.ఫొ. ..పోవొయ్యి అంటే నేను చెప్పేది ఏమీ లేదు
నువ్వు జగన్ కోణం లో చూడు చెరసాల కి వెళ్ళు
Orey langa the Jagguloo,
Joker kaa(m)pu pushapalu mariyu ka(a)mma pushapalu, mari velams pushpala kaalu kaduguthu, eppudu reddi pushpala kallu kadugutunnayee.mari etla maarpu vastundi? Hyderabad lo ayena vijayavadalo ayena kaa(m)pu janalu and Ka(a)mma janalu ee naakadamu aapithe nijamina vishayalu velugoloki vastayee. Eppudu GA meeda padatamuntappa, abhivruddhi ante eepushpalaku telusa??
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
అంధ్రోల్లు ఇలా బళ్ళు పెట్టి చెత్త చేస్తున్నారు. సకురాత్రికి సూడాలి సిన్నమ్మగారు, ఆంధ్ర అంతా కంపు హైదరాబాద్ ఇల్లు అలికి ముగ్గేట్టినట్టు కళకళలాడయి. మారెటో ఆంధ్ర అభివృద్ది పథం అని పేపరోళ్ళు రాత్తరు రోట్ట మొత్తం హైదరాబాద్ లోనే ఉంటారు
అవునా తెలంగాణ వాళ్ళు లంగాలు అయితే ఇట్లనే ఉంటది మంచి జరిగితే మాది లేకుంటే అది ఆంధ్రోళ్లు చేసేరు అని ఏడవటమే ఇంకేమి వొచ్చు
Joker kaa(m)pu pushapalu mariyu ka(a)mma pushapalu, mari velams pushpala kaalu kaduguthu, eppudu reddi pushpala kallu kadugutunnayee.mari etla maarpu vastundi? Hyderabad lo ayena vijayavadalo ayena kaa(m)pu janalu and Ka(a)mma janalu ee naakadamu aapithe nijamina vishayalu velugoloki vastayee. Eppudu GA meeda padatamuntappa, abhivruddhi ante eepushpalaku telusa??
అదె మా జగన్ అన్న అయితె…. వొట్ల కొసం Financial district మొత్తం సెంటు స్తలాలు పంచెవాడు! మీరు బ్రతికిపొయారు!
Joker kaa(m)pu pushapalu mariyu ka(a)mma pushapalu, mari velams pushpala kaalu kaduguthu, eppudu reddi pushpala kallu kadugutunnayee.mari etla maarpu vastundi? Hyderabad lo ayena vijayavadalo ayena kaa(m)pu janalu and Ka(a)mma janalu ee naakadamu aapithe nijamina vishayalu velugoloki vastayee. Eppudu GA meeda padatamuntappa, abhivruddhi ante eepushpalaku telusa??
పదేళ్లు ముక్కోడు బంగారు తెలంగాణ చేసిండు కదా , లొట్టపీసు రోడ్లు కవిత లిక్కర్ దందాలకి కూడా పనికిరావు లేకుంటే ముక్కోడు వాడి ఫామిలీ ఎప్పుడో రేస్ కార్లు నడిచేంత పెద్దవి కట్టేవాడు , అసలే ఆ బ్రాండు మీద 700 కోట్లు సంపాదించాడు లోడపిత్తుల కేటీఆర్ గాడు
Joker kaa(m)pu pushapalu mariyu ka(a)mma pushapalu, mari velams pushpala kaalu kaduguthu, eppudu reddi pushpala kallu kadugutunnayee.mari etla maarpu vastundi? Hyderabad lo ayena vijayavadalo ayena kaa(m)pu janalu and Ka(a)mma janalu ee naakadamu aapithe nijamina vishayalu velugoloki vastayee. Eppudu GA meeda padatamuntappa, abhivruddhi ante eepushpalaku telusa??