లూసిఫర్ 2 ఎమోషన్లను మించిన భారీతనం

లిభాగానికి ఈ సీక్వెల్ కు వున్న ప్రధానమైన తేడా ఏమిటంటే భారీతనం. ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ భారీ యాక్షన్ సినిమాను చూడబోతున్నారనే విధంగా టీజర్ కట్ చేసారు.

లూసిఫర్ సినిమా ఓ క్లాసిక్. మలయాళంలో వచ్చిన ఈ సినిమా లో మంచి భావోద్వేగాలు చోటు చేసుకుని, ఫ్రేక్షకుడిని మొదటి నుంచి చివరి వరకు ఇన్ వాల్వ్ చేస్తాయి. మోహన్ లాల్ నటన… అతని మీద చాలా సున్నితంగా తీసిన ఎలివేషన్ సీన్లు ఓ లెవెల్ లో వుంటాయి. సినిమాలో బలమైన భావోద్వేగాలు, మంచి విజువల్స్, అంతకు మించిన బలమైన కథ వుంటాయి. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ హీరోగా అనువదించారు. అయినా కూడా మలయాళ వెర్షన్ లెవెల్ వేరే.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఎల్ 2 ఎంపరర్ అని టైటిల్ పెట్టిన ఈ సినిమాను లైకా సంస్థ సమర్పిస్తోంది. పృధ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక విధంగా లూసిఫర్ కు ఇది ప్రీక్వల్ ప్లస్ సీక్వెల్ అనుకోవాలి. మోహన్ లాల్ పాత్ర నేఫథ్యం తొలిభాగంలో వుండదు. అందువల్ల ఆ నేపథ్యం, మళ్లీ మరోసారి సోదరి పాత్రకు వచ్చిన కష్టం వెరసి రెండో భాగంగా వుండబోతోందని ఈ రోజు విడుదల చేసిన టీజర్ చెబుతోంది.

తొలిభాగానికి ఈ సీక్వెల్ కు వున్న ప్రధానమైన తేడా ఏమిటంటే భారీతనం. ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ భారీ యాక్షన్ సినిమాను చూడబోతున్నారనే విధంగా టీజర్ కట్ చేసారు. తొలిభాగంలో ఎమోషనల్ హై వుంటుంది. అది మలిభాగంలో వుంటుందనే అనుకోవాలి. ట్రయిలర్ వస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే సినిమాకు కావాల్సిన హైప్ సాధించడంలో మాత్రం టీజర్ సక్సెస్ అయిందనే చెప్పాలి.

2 Replies to “లూసిఫర్ 2 ఎమోషన్లను మించిన భారీతనం”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.