రామ్ చరణ్ నుంచి మరో క్లారిటీ

గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ సినిమాలపై అనుమానాలు పెరిగిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తోంది అతడి టీమ్.

గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ సినిమాలపై అనుమానాలు పెరిగిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తోంది అతడి టీమ్.

మొన్నటికిమొన్న చరణ్-బుచ్చిబాబు సినిమా నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. అలాంటిదేం లేదని, ప్రస్తుతం రెహ్మాన్ తమ ప్రాజెక్టుపైనే పని చేస్తున్నాడని క్లారిటీ ఇచ్చింది చరణ్ టీమ్.

ఇప్పుడు మరో అంశంపై కూడా స్పష్టత వచ్చేసింది. త్వరలోనే దిల్ రాజుకు చరణ్ మరో సినిమా చేయబోతున్నాడనే ప్రచారంపై స్పందించింది. దిల్ రాజు బ్యానర్ పై చరణ్ ఎలాంటి ప్రాజెక్టుకు కమిట్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం చరణ్ చేతిలో ఉన్న సినిమా ఒక్కటే. బుచ్చిబాబు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాలో అతడు నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.

ఇంతకుముందు చరణ్-సుకుమార్ కాంబోలో రంగస్థలం వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా రూపుదిద్దుకోబోతోంది. కెరీర్ లో చరణ్ కు ఇది 17వ చిత్రం.

4 Replies to “రామ్ చరణ్ నుంచి మరో క్లారిటీ”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.