ఆ డిమాండ్ మరీ అంత అసంబద్ధమైనదా?

ఒక పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజలకు ఇప్పుడు కొత్త సందేహాలు కలిగిస్తున్నాయి.

ఒక పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు సాధారణ ప్రజలకు ఇప్పుడు కొత్త సందేహాలు కలిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద చాలా కేసులు ఉన్నాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడి మీదనైనా కేసులు ఉండడం వింత కాదు. అందులో కొన్ని నిజంగా నేరాలకు పాల్పడిన కేసులే కావొచ్చు.. లేదా, కొన్ని రాజకీయ ప్రత్యర్థులు బనాయించిన కేసులు కావొచ్చు. ఏదైనా సరే.. ఆయా విచారణ సంస్థలు నిగ్గు తేల్చాలి.

అయితే చంద్రబాబు మీద సీఐడీ వద్దనే ఏడు కేసులు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సీఐడీ వద్ద ఆ కేసులు ఉన్నప్పుడు.. రాష్ట్రప్రభుత్వాధినేత మీద నమోదైన కేసుల విచారణ సవ్యంగా జరుగుతుందని ఎవరైనా ఆశించగలరా? ఇలాంటి అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది.

ఇలాంటి అతి సహజమైన అనుమానం ఫలితంగానే.. హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు మీద ఏపీ సీఐడీ వద్ద పెండింగులో ఉన్న ఏడు కేసులను సీబీఐకు బదిలీ చేయాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు. అయితే సుప్రీం ధర్మాసనం ఈ పిటిషన్ పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ.. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసంన పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కేవలం పిటిషన్ ను కొట్టివేయడం మాత్రమే కాదు. ‘పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని’ బేలా త్రివేది హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. కేసును వాదించడానికి పూనుకున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ను ఉద్దేశించి.. ‘మీరు ఇలాంటి పిటిషన్లు కూడా వాదిస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, డిస్మిస్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

సుప్రీం కోర్టు అలాంటి నిర్ణయం తీసుకున్న విషయంలో ప్రజల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబునాయుడు రాజకీయ నాయకుడు గనుక.. ఆయనకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ దాఖలైతే అది రాజకీయ ప్రేరేపిత చర్య అని అనుకోవడానికి అవకాశం ఉంది. సంభావ్యత కూడా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు తెర వెనుక ఉండి ఇలాంటి పిటిషన్ వేయించారని కూడా అనుకోవచ్చు. అయితే కావొచ్చు గాక.. కానీ.. అలాంటి డిమాండ్ మరీ అంత అసంబద్ధమైనదా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.

చంద్రబాబు ప్రస్తుతం ప్రభుత్వాధినేతగా ఉండగా.. ఆయన ఆధీనంలో పనిచేసే సీఐడీ వంటి దర్యాప్తు సంస్థ.. ఆయన మీద ఉన్న కేసులను నిష్పాక్షికంగా దర్యాప్తు చేయగలుగుతుందా? అనే సందేహం ఎవ్వరికైనా వస్తుంది. నిజానికి ఈ కేసులను సీబీఐకు బదిలీ చేయడం చంద్రబాబు ఇంటెగ్రిటీకే మేలు చేస్తుంది.

ఎలాగంటే.. ఫరెగ్జాంపుల్ సీఐడీ ఆయన నిర్దోషి అని ఆ కేసుల్లో తేలిస్తే గనుక.. చంద్రబాబు ఒత్తిడితో అలా జరిగిందనే రాజకీయ విమర్శలు వస్తాయి. అలా కాకుండా సీబీఐకు బదిలీ అయి, వారు నిర్దోషి అని తేలిస్తే.. చంద్రబాబు ఇంటెగ్రిటీ పెరుగుతుంది. మరి సుప్రీం కోర్టు ఈ పిటిషన్ గురించి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు ఎందుకు చేసిందనేది ప్రజలకు అర్థం కావడం లేదు.

9 Replies to “ఆ డిమాండ్ మరీ అంత అసంబద్ధమైనదా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. న్యాయమూర్తులు పదవిలో నున్న సమయంలో పట్టుబడిన నకిలి దళిత ఉద్యోగులను డిస్మిస్ చేయకుండా సేవాకాలం అంతా జీతం వచ్చేటట్టు కమిట్మెంట్ తో స్టే, (కాలాయాపన చేసి చివర్లో సంశయలాభం) ఇస్తారు.పరోక్షంగా వారికి కావాల్సింది తీసుకుని, న్యాయమూర్తులు నిజాయితీగా సహాయం చేస్తారు. పదవీవిరమణ చేసిన తర్వాత దళిత ప్రజలకు అన్యాయం జరుగుతోంది. న్యాయవ్యవస్థలో సంస్కరణలు జరగాలి. ఒక కమిటీ ఏర్పాటు చేసి, మాకు ఆ కమిటీలో స్థానం కల్పించాలని పరోక్షంగా చిలకపలుకులు చెబుతారు- B Rajaratnam. TSP College,Koti

Comments are closed.