కొలిక‌పూడి అల్టిమేటం విజ‌య‌వాడ సీపీకా? ప్ర‌భుత్వానికా?

తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు మ‌రోసారి వార్త‌ల‌కెక్కారు. విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌కు ఆయ‌న అల్టిమేటం ఇచ్చారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు మ‌రోసారి వార్త‌ల‌కెక్కారు. విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్‌కు ఆయ‌న అల్టిమేటం ఇచ్చారు. ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లిన బాధిత మ‌హిళ‌తో తిరువూరు ఎస్ఐ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని, బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల్లోపు స‌స్పెండ్ చేయాల‌ని డెడ్‌లైన్ విధించారాయ‌న‌. ఒక‌వేళ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే బాధిత కుటుంబంతో క‌లిసి తిరువూరు పీఎస్ ఎదుట ధ‌ర్నాకు దిగుతాన‌ని అల్టిమేటం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తిరువూరు ఎమ్మెల్యే వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. కొలిక‌పూడి వ్య‌వ‌హార శైలితో కూట‌మి ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని సీఎం చంద్ర‌బాబుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవ‌ల ఒక గిరిజ‌న మ‌హిళ‌పై దాడి, ఆమె ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేయ‌డంతో టీడీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. ఈ నేప‌థ్యంలో క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ కొలిక‌పూడిని పిలిచి వివ‌ర‌ణ తీసుకుంది.

కొలిక‌పూడిని మంద‌లించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌పై ప్ర‌భుత్వానికి న‌ష్టం తీసుకొచ్చే ప‌నులు చేస్తే, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని హెచ్చ‌రించి పంపిన‌ట్టు ప్ర‌చార‌మైంది. ఈ నేప‌థ్యంలో కొలిక‌పూడి సీపీకి అల్టిమేటం ఇవ్వ‌డం ద్వారా ఎవ‌రిని హెచ్చ‌రించాల‌ని అనుకుంటున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లిన మ‌హిళ‌… త‌న‌ను ఎస్ఐ ఇబ్బంది పెట్టిన‌ట్టు ఎమ్మెల్యే, అలాగే విజ‌య‌వాడ సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా సీరియ‌స్‌గా స్పందించ‌డం గ‌మ‌నార్హం. కొలిక‌పూడి అల్టిమేటం నేప‌థ్యంలో ఎస్ఐపై చ‌ర్య‌లు తీసుకుంటారా? లేక లైట్‌గా తీసుకుంటారా?అనేది తేలాల్సి వుంది.

4 Replies to “కొలిక‌పూడి అల్టిమేటం విజ‌య‌వాడ సీపీకా? ప్ర‌భుత్వానికా?”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.