తండేల్.. టోటల్ ఓన్ రిలీజ్

నిర్మాత అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా మొత్తాన్ని స్వంతంగా కేవలం అడ్వాన్స్ ల మీద విడుదల చేయాలని.

చైతన్య-సాయిపల్లవి-చందు మొండేటి-బన్నీ వాసు కాంబినేషన్‌లో రూపొందిన సినిమా తండేల్. గీతా సంస్థ భారీ నిర్మాణం, భారీ అంచనాలు, భారీ ఖర్చు. ఈ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్ కు రాబోతోంది. ఈ టైమ్ లో నిర్మాత అల్లు అరవింద్ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా మొత్తాన్ని స్వంతంగా కేవలం అడ్వాన్స్ ల మీద విడుదల చేయాలని.

నిజానికి గీతాసంస్థ తన సినిమాలను చాలా వరకు స్వంతంగానే విడుదల చేస్తుంది. కొద్ది ఏరియాలు మాత్రం విక్రయిస్తుంది. వైజాగ్ లాంటి ఏరియాలను దిల్ రాజు లాంటి వారికి విక్రయించడం మామూలే.

కానీ తండేల్ ను మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎక్కడా విక్రయించడం లేదు. పూర్తిగా అడ్వాన్స్ ల మీదనే విడుదల చేస్తున్నారు. సినిమా ఫైనల్ వర్క్ ను చూసిన తరువాత నిర్మాత అల్లు అరవింద్ ఈ నిర్ణయానికి వచ్చారు. దిల్ రాజు కు కూడా ఈ నిర్ణయాన్ని తెలిపారు.

తండేల్ సినిమాకు థియేటర్ మీద చాలా రావాల్సి వుంది. ఎలా లేదన్నా కనీసం 35 నుంచి 40 కోట్లు థియేటర్ నుంచి రావాలి. కానీ నాగ్ చైతన్య మీద అంతంత మొత్తాలు బెట్ పెట్టమంటే అందరూ ముందుకు రాకపోవచ్చు. అందువల్ల అలా లెక్కలు పెట్టుకునే బదులు అడ్వాన్స్ లు అయితే అల్లు అరవింద్ మీద వున్న నమ్మకంతో ఎంతయినా ఇస్తారు. లాభం నష్టం ఏదైనా అల్లు అరవింద్ కే వుంటాయి. నామినల్ కమిషన్ తో పంపిణీ జరుగుతుంది.

సినిమా మీద నమ్మకం లేకపోతే ఎన్ఆర్ఏ కింద అమ్మేయాలి. నమ్మకం వుంది కనుక అడ్వాన్స్ ల మీద విడుదల చేసుకుంటున్నారు.

3 Replies to “తండేల్.. టోటల్ ఓన్ రిలీజ్”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.