మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి షాక్ ఇచ్చారు. మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేయడాన్ని బుచ్చయ్య చౌదరి తిప్పి కొట్టడం గమనార్హం. లోకేశ్, బుచ్చయ్య మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. మరోసారి ఆ విభేదాలు తాజా కామెంట్స్‌తో బయటపడ్డాయి.
టీడీపీలో చిన్నా, పెద్దా నాయకులు పోటీలు పడి మరీ… లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబునాయుడు వైఎస్సార్ జిల్లా మైదుకూరు పర్యటనలో బహిరంగ సభా వేదికగా టీడీపీ సీనియర్ నేత ఆర్.శ్రీనివాస్‌రెడ్డి డిప్యూటీ సీఎంగా లోకేశ్‌ను చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ కూడా ఇదే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు ఆదేశించారనే వార్తలొచ్చాయి. దీంతో ఆ డిమాండ్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి మళ్లీ డిప్యూటీ సీఎం తేనెతుట్టెను కదిలించారు. డిప్యూటీ సీఎంగా లోకేశ్‌ను చేయాలనే డిమాండ్ సరైంది కాదని బుచ్చయ్య అన్నారు.
ఎందుకంటే, ఇప్పటికే పవన్‌కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారన్నారు. అలాంటప్పుడు లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలనడం, పవన్‌ను తక్కువ చేయడమే అని బుచ్చయ్య చౌదరి భావనగా చెబుతున్నారు. ఇదే సందర్భంలో లోకేశ్‌పై తన వ్యతిరేకతను బుచ్చయ్య చౌదరి చాటుకున్నట్టుగా టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
హ హ హ…పెద్ద తిరకాసే…నమ్మక్కర్లా
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ఎంత విషం చిమ్ముతున్నావు neutral జర్నలిస్ట్ GA, పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు!! అయినా, వెకిలి వెధవ గురుంచి రాయటానికి ఏముందిలే !! శునకానందం పొందు!!