ఏబీవీ ప‌వ‌ర్ వెలిగిపోతోంది!

కూట‌మి అధికారంలో వుండ‌డంతో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు అన్నీ మంచిరోజులే.

కూట‌మి అధికారంలో వుండ‌డంతో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు అన్నీ మంచిరోజులే. మొట్ట‌మొద‌ట‌గా ఆయ‌న కేసుల‌న్నీ ప్ర‌భుత్వం ఎత్తివేసింది. తాజాగా ఏబీవీకి మ‌రో ప్ర‌యోజ‌నం క‌లిగిస్తూ కూట‌మి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం విశేషం. ఏబీ వెంకటేశ్వ‌ర‌రావుపై గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం విధించిన స‌స్పెన్ష‌న్ కాలాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

ర‌క్ష‌ణ ప‌రిక‌రాల కొనుగోలు వ్య‌వ‌హారంలో అక్ర‌మాలకు పాల్ప‌డ్డార‌న్న కార‌ణంతో రెండు ద‌ఫాలు ఏబీవీపై ప్ర‌భుత్వం స‌స్పెన్ష‌న్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 2020, ఆ త‌ర్వాత 2022లో రెండో ద‌ఫా ఆయ‌న్ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న‌న్నాళ్లు దాదాపు ఆయ‌న విధులకు దూరంగా ఉన్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఫోన్ ట్యాపింగ్‌లు, అలాగే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీలో జాయిన్ కావ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని ఆ పార్టీ నేత‌లు అప్ప‌ట్లో ఆరోపించారు. వైసీపీ ప్ర‌భుత్వం రావ‌డంతో ఏబీవీకి ఇబ్బందులు త‌ప్ప‌లేదు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఒక‌రోజు ముందు మాత్ర‌మే ఆయ‌న‌కు పోస్టింగ్ ఇచ్చారు.

ఇదిలా వుండ‌గా ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వుల‌తో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు సస్పెన్ష‌న్ కాలంలో వేత‌నం, అల‌వెన్స్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ద‌క్క‌నున్నాయి.ఇప్పుడు ఏబీవీ ప‌వ‌ర్ అలా వెలిగిపోతోంది మ‌రి!

9 Replies to “ఏబీవీ ప‌వ‌ర్ వెలిగిపోతోంది!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ABV పోయిన వారం మా పవన్ నీ కలిసి కా-ళ్ళు పట్టుకొని ఏడిచాడు అంటా… అందుకే పవన్ రికమాడ్ చేశాడు

  3. “తాజా ఉత్త‌ర్వుల‌తో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు సస్పెన్ష‌న్ కాలంలో వేత‌నం, అల‌వెన్స్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ద‌క్క‌నున్నాయి”..

    everyone in andhra knows how he was treated…he is given what he owed and you write this article?

    siggu vadilesava che ddi?

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  5. చేతిలో పదవి వున్నదని ఆయనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసేరో మీకు తెలుసు వాళ్ళ గురించి ఎక్కడ రాయకుండా సిగ్గులేకుండా ఈయన గురించి రాయటం ఏమిటి ఈయనను ఇబ్బంది పెట్టిన వారి కేసు లను ఈయనను ఇబ్బంది పెట్టిన అధికారుల అవినీతి కేసులను ఈయనకు మానిటర్ చేసే అధికారం ప్రభుత్వం ఇస్తేనే ఈయనకు న్యాయం జరిగినట్టు

Comments are closed.