టాలీవుడ్‌లో ఓ టైటిల్ ఆసక్తి రేకెత్తిస్తుంది. దాని గురించే సినీ జనాలు ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. ఆ పేరే.. జనగణమన. దిల్‌రాజు ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ కోసమే అని టాలీవుడ్ టాక్. అయితే దర్శకుడు ఎవరు? ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది?? అనే విషయం తేలడం లేదు. దిల్‌రాజు సంస్థలో పనిచేసి, ఆ సంస్థకు విజయాలు అందించిన ఓ దర్శకుడు.. ఈసినిమాని టేకప్ చేస్తారని చెప్పుకొంటున్నారు.
ఇంకొంతమంది.. దర్శకత్వబాధ్యత కూడా పవనే స్వీకరిస్తారు అంటున్నారు. జానీ తరవాత డైరెక్షన్ జోలికి వెళ్లలేదు.. పవన్. మళ్లీ ఓ సినిమాని డైరెక్ట్ చేస్తా అనడం తప్ప.. ఆ సాహసానికి ఒడిగట్టలేదు. అయితే జనగణమన కథ నచ్చి.. ఈ సినిమాకి పచ్చజెండా ఊపాడని, దర్శకత్వంపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడని చెప్పుకొంటున్నారు.
ఒక వేళ ఈ సినిమా ఒప్పుకొన్నా.. ఈ యేడాది మాత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే… ఓమైగాడ్, గబ్బర్ సింగ్- 2 లైనులో ఉన్నాయి. కోబలి కూడా పూర్తి చేయాలి. ఇవన్నీ పూర్తయ్యేలోగా చాలా సమయం పడుతుంది. ఈలోగా జనగణమన ఉంటుందో, ఇంకొకరు పాడేస్తారో.. ?!