ఓటీటీల్లో ఈ వారం భారీ, ఇంట్ర‌స్టింగ్ సినిమాలు!

నాలుగేళ్ల కింద‌టే ఈ సినిమా థియేట‌రిక‌ల్ రిలీజ్ పొందింది. ఇప్పుడు ఓటీటీలో ఇది అందుబాటులోకి వ‌స్తోంది.

వివిధ ఓటీటీ యాప్స్ లో ఈ వారం ఆస‌క్తిదాయ‌క‌మైన సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. వీటిల్లో పుష్ప 2 కూడా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 30వ తేదీన పుష్ప 2 రీలోడెడ్ వెర్ష‌న్ గా విడుద‌ల అవుతుంద‌ట‌. అయితే నెట్ ఫ్లిక్స్ యాప్ లో అప్ క‌మింగ్ లిస్ట్ లో ఇంకా ఈ సినిమాను చూపించ‌డం లేదు. నెట్ ఫ్లిక్స్ అధికారిక ట్విట‌ర్ అకౌంట్లో ఈ సినిమా విడుద‌ల‌ను తేదీ లేకుండా ధ్రువీక‌రించారు.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళీ, హిందీ వెర్ష‌న్ల‌లో త్వ‌ర‌లో అనే ట్వీట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్. త‌మ విడుద‌ల‌లో ఇటీవ‌ల ఆ సినిమాకు యాడ్ చేసిన 24 నిమిషాల ఫుటేజ్ ఉంటుంద‌ని మాత్రం ప్ర‌క‌టించింది.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ఈ వారం ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన బెంగాళీ సినిమా విడుద‌ల అవుతోంది. అదే ది స్టోరీ టెల్ల‌ర్. స‌త్య‌జీత్ రే రాసిన ఒక షార్ట్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ప‌రేష్ రావ‌ల్, న‌సీరుద్దీన్ షా, రేవతి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 28 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట స్టార్ లో అందుబాటులో ఉంటుంది.

ఇక ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లైన మ‌ల‌యాళీ సినిమా *ఐడెంటిటీ* ఈ వారంలో జీ ఫైవ్ లో అందుబాటులోకి వ‌స్తోంది. మ‌ల‌యాళీ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన మ‌రో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఇది. టోవినో థామ‌స్, త్రిష‌, మందిరా బేడీ తో స‌హా సంజ‌య్ ద‌త్ ఒక ముఖ్య పాత్ర‌లో న‌టించాడు ఈ సినిమాలో. ఇది జ‌న‌వ‌రి 31 వ తేదీన జీఫైవ్ లో అందుబాటులోకి రానుంది.

ల‌య‌న్స్ గేట్ ప్లే లో ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన కొరియ‌న్ సినిమా విడుద‌ల అవుతోంది. దాని పేరు అసుర‌డో. నాలుగేళ్ల కింద‌టే ఈ సినిమా థియేట‌రిక‌ల్ రిలీజ్ పొందింది. ఇప్పుడు ఓటీటీలో ఇది అందుబాటులోకి వ‌స్తోంది.

2 Replies to “ఓటీటీల్లో ఈ వారం భారీ, ఇంట్ర‌స్టింగ్ సినిమాలు!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.