ఈ ప్రశ్నను ఎవరైనా వస్తే అన్నింటి విషయంలో కాకపోయినా, చాలా వాటిల్లో అండ్రాయిడ్ లో ఆర్డర్ చేయడానికి, ఐ ఫోన్ లో ఆర్డర్ చేయడానికి వ్యత్యాసం ఉందని చెప్పక తప్పకతప్పదు. ప్రస్తుతం ఈ కామర్స్ రాజ్యం నడుస్తూ ఉంది. క్విక్ కామర్స్ శకం ఇది. ఇలాంటి నేపథ్యంలో ప్రతీదీ స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారానే ఆర్డర్ పెట్టుకోవడం సహజం. మరి ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ యాప్స్ ఓఎస్ ను బట్టి ధరలు ఆధారపడుతున్నాయనేది ప్రజలు నెమ్మదిగా గ్రహిస్తున్న అంశం.
ఆ మధ్య ఇన్ స్టాగ్రమ్ లో ఒకరు ఇందుకు సంబంధించి కూలంకషమైన వీడియోను చిటికెలో చూపించారు. ఎక్కడి కైనా టూర్ కు వెళ్లినప్పుడు, లేదా ఏదైనా నగరంలో హోటల్ బుక్ చేసుకోవాలనుకుంటే.. అందుకు సంబంధించిన ఒకే యాప్ ద్వారా ఆండ్రాయిడ్ లో చూపిస్తున్న ధరకూ, ఐఫోన్ లో చూపిస్తున్న ధరకూ వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో లెక్క గట్టారు.
ఉదాహరణకు ఒక మేక్ మై ట్రిప్ అనే అప్లికేషనో ఇంకోటో.. ఒక నగరంలో హోటల్ బుక్ చేసుకోవాలనుకుంటే, ఒకే హోటల్ పేరు, ఒకే సౌలభ్యాలతో ఉండే రూమ్ ను ఎంచుకుంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ లో చూపే ధరకూ, ఐ ఫోన్ లో చూపే ధరకూ చాలా వ్యత్యాసం ఉంది. ఆండ్రాయిడ్ లో ఆ యాప్ చూపే ధర కన్నా ఐ ఫోన్ లో అదే యాప్ అదే రూమ్ విషయంలో చూపే ధర కొన్ని వందల రూపాయలు ఎక్కువగా ఉంది!
ఇలా టూర్లు వెళ్లినప్పుడు.. మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఐ ఫోన్ కన్నా ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే ట్రై చేయండనే సందేశంలో ఆ వీడియో ముగస్తుంది. ఆ సంగతలా ఉంటే.. బెంగళూరులో ఒక మహిళ జెప్టోలో క్యాప్సికం ను ఆర్డర్ చేయడంలో తనకు ఎదురైన ఇలాంటి పరిస్థితిని షేర్ చేసింది.
అరకేజీ క్యాపిక్సం ను జెప్టోలో ఆర్డర్ చేయడానికి ఆమె ప్రయత్నించిందట. ముందుగా ఆండ్రాయిడ్ లో దాని ధర చూస్తే 137 రూపాయలని ఉంది, అయితే ఆఫర్ లో అది కేవలం 21 రూపాయలని ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్ స్టాలైన జెప్టోలో చూపుతోంది. అదే సమయంలో ఆమె ఐ ఫోన్ లో అదే క్విక్ కామర్స్ యాప్ ను ఓపెన్ చేసి, అదే పరిమాణంలోని క్యాప్సికం ను ఆర్డర్ చేయాలని చూస్తే అందులో కూడా 137 రూపాయల ధర చూపినా, ఇచ్చే రేటు మాత్రం ఏకంగా 107గా ఉంది! అంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్ స్టాల్ అయిన జెప్టోలో ఆర్డర్ పెడితే 21 రూపాయలు, ఐ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసిన అదే యాప్ ద్వారా అదే పరిమాణంలోని క్యాప్సికం ధర 107! ఇదేంటంటూ ఆమె జెప్టోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టింది.
అయితే దీనిపై నాలెడ్జ్ ఉన్న వాళ్లు స్పందిస్తూ దీనికి పలు కారణాలున్నాయని అంటున్నారు. అందులో ఒకటి టెక్నికల్ ఎర్రర్ అయి ఉండవచ్చు. రెండోది కొన్ని రకాల ఆఫర్లు కేవలం ఆండ్రాయిడ్ వినియోగారులకు జెప్టో ఇచ్చి ఉండవచ్చు. ఆల్గారిథమ్ మిస్టేక్ అయి ఉండవచ్చు. ఇవన్నీ కాకుండా.. ముందుగా చెప్పుకున్నట్టుగా ఆండ్రాయిడ్ కన్నా ఐ ఫోన్ లో కొన్ని రకాల వాటి ధరలు ఎక్కువగా ఉన్నట్టే, ఇది కూడా ఐ ఫోన్ రిచ్ నెస్ కు ఉదాహరణ కావొచ్చు అని వారు చెబుతూ ఉన్నారు.
అయితే ఇవే కాదు.. ఇన్ స్టాగ్రమ్ లో ఒక పోస్ట్ ను ప్రమోట్ చేయాలంటే ఐ ఫోన్ లో చూపించే ధరకూ, అదే రీచ్ కు మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉండే కంప్యూటర్ ద్వారా ప్రమోషన్ చార్జీకీ చాలా వ్యత్యాసం ఉంది. ఆ విషయంలో కూడా ఐఫోన్ లో ధర చాలా ఎక్కువ!
అండ్రాయిడ్, ఐ ఫోన్లు OSలు అంటావేందిరా తింగిరీ.. ఆండ్రాయిడ్ and ఐ OS లు అనాలి.
మామూలు రోడ్డు పక్క ఎగ్ ప*ఫ్ 10 రూపాయలు.
అదే ప్యాలస్ లో ఆన్న తింటే మాత్రం 100 రూపాయలు.
మన ప్రజల డబ్బు తోనే ఫ్యామిలీ మొత్తం తినేసింది, 4 ఏళ్లు పాటు, రోజుకు లక్ష ఎగ్ పఫ్ లు లెక్కన.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
అలాగే బాటరీ 10% ఉన్నప్పుడు OLA,UBER బుక్ చేసిన
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
it is as simple as that .. it is based on OS which is installed. As per data Andriod will be used by lot of public and it is user friendly so companies will provide more offers on that. IOS gurinchi telisinde.