డేటా సెంటర్.. గూగుల్ సాయం నిజమా?

నమ్మే జనం వున్నంత వరకు రాస్తూనే వుంటారు.

విశాఖలో భారీ డేటా సెంటర్.. ఈ రోజు ప్రధాన పత్రికల్లో ఈవార్త చదవగానే జనం ఎంతలా నమ్మేస్తారో. హైదరాబాద్ లో హైటెక్ సిటీ. విశాఖలో డేటా సిటీ అనగానే ఇంకెంత ఆనందమో. నిజమే కదా. మన ఊరిలో, మన ప్రాంతంలో ఇలాంటిది వస్తే ఆనందమే కదా. కానీ ఇవన్నీ జనాలను మభ్య పెట్టే వార్తలు అని తెలిస్తే కాస్త బాధేస్తుంది. హెడ్డింగ్ ఒకటి. లోపల వార్త మరొకటి. హెడ్డింగ్ లో గూగుల్ తో ఒప్పందం. అయిదు వందల ఎకరాల్లో ఏర్పాటు. అయిదేళ్లలో అయిదు లక్షల ఉద్యోగాలు. ఎంత అద్భుతంగా వున్నాయి శీర్షికలు.

ఇంతకీ వార్తలో వైనం ఏమిటి? విశాఖలో డేటా సెంటర్ అనే బిల్డింగ్ ఒకటి కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. అంత వరకు వాస్తవం. కట్టేది.. కట్టాల్సింది.. రాష్ట్ర ప్రభుత్వమే. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకుంటాం అంటే… ఏర్పాటు.. చేసుకుంటాం… చేస్తాం అంటే అదీ 80 ఎకరాల్లో ప్రభుత్వం సహకరిస్తుంది. ఎఐ వినియోగం, యువతకు శిక్షణకు గూగుల్ ప్రభుత్వానికి సహకరిస్తుంది.

అంతే… అంతకు మించి ఈ అయిదు వందల ఎకరాల్లో డేటా సెంటర్ దేనికి, దాంట్లో వచ్చేందుకు రెడీగా వున్న సంస్థలు ఏమిటి? అసలు ఏమైనా వస్తాయా? వస్తే ఎప్పటికి వస్తాయి? అసలు అయిదు వందల ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మాణం ఎన్ని చదరపు గజాల్లో. ఎంత ఖర్చు. ఎప్పటికి పూర్తి అవుతుంది.

ఇవేమీ లేవు.

కానీ… అయిదేళ్లలో అయిదు లక్షల ఉద్యోగాలు అని మాత్రం లెక్క కట్టేసారు. ఇటీవలే ఎప్పుడో రాబోయే బిపిసిఎల్ రిఫైనరీతో కలిపి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలు ఉద్యోగాలు ఆరేడు నెలల్లోనే వచ్చేసాయి అని చెప్పేసారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పేసారు. ఎండార్స్ చేసేసి, ముద్రవేసేసారు. ఇప్పుడు దీన్ని కూడా పవన్ ఎండార్స్ చేసేస్తారు. జనం నమ్మేస్తారు.

నమ్మే జనం వున్నంత వరకు రాస్తూనే వుంటారు.

11 Replies to “డేటా సెంటర్.. గూగుల్ సాయం నిజమా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. చింతకాయకు దిక్కు లేదు కానీ చింతాకు పతకం చేయిస్తా రామ అన్నాడుట. 5yrs ఆర్ధిక విధ్వంసం, మీకు అన్ని తూచ్ అంటారు, ఇలాంటి బిస్క్యూట్ వేస్తారు.

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. mundhu pani అంటూ మొదలయితే ఆ తరువాత సంగతి తరువాత .అన్ని మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చేస్తాయి ఆ దేంతో

  5. ఫ్రెష్ ఫిష్ మార్కెట్, మీట్ మార్కెట్, ప్రాన్స్ మార్కెట్ కి 100 ల ఎకరాలు ఇచ్చారు కదా.

Comments are closed.