దిల్ రాజు.. భారం దిగింది.. వాట్ నెక్ట్స్!

సంస్థను అన్ని విధాలుగా రీ కన్ స్ట్రక్షన్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాత దిల్ రాజు ది టాలీవుడ్ లో ఒక స్పెషల్ ప్లేస్. బయ్యర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబటర్ గా, నిర్మాతగా, టాలీవుడ్ ను లీడ్ చేసే పర్సన్ గా ఇలా మల్టిపుల్ గా పేరు సంపాదించారు. సక్సెస్ ఫుల్ గా సినిమాలు తీసారు. పంపిణీ చేసారు. కానీ ఇటీవల కొంత కాలంగా టైమ్ సరిగ్గా లేదు.

నైజాంలో పంపిణీ పరంగా పోటీని గట్టిగా ఎదుర్కుంటున్నారు. మరోపక్కన గేమ్ ఛేంజర్ సినిమా ఆయన సహనాన్ని, డబ్బును, కాలాన్ని అన్నింటినీ హరించి వేసింది. ఇప్పుడు అంతా ప్రశాంతంగా వుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అరి వీర బ్లాక్ బస్టర్ కావడం, తల మీద నుంచి గేమ్ ఛేంజర్ భారం దిగిపోవడం, గేమ్ ఛేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం సినిమా భర్తీ చేసేయడం ఇలా అన్నీ కలిసి దిల్ రాజు సంస్థ ను నార్మల్ స్థితికి తీసుకువచ్చాయి.

ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాలి. చేతిలో తమ్ముడు సినిమా విడుదలకు రెడీగా వుంది. విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ అవుతోంది. నితిన్ తో బలగం వేణు డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేయాలి. ఇవీ ఇప్పటికి ఫిక్స్ అయిన ప్రాజెక్ట్ లు. ఇక మీద ఎలా ముందుకు వెళ్లాలి అన్నది, తన సామ్రాజ్యాన్ని ఎలా నిలబెట్టి, మరింత విస్తరించాలి అన్నది చూసుకోవాలి.

నైజాంలో పంపిణీకి గట్టిపోటీ ఎదురయింది. వైజాగ్ లో కూడా పోటీ గట్టిగా వుంది. నైజాంలో సితార/హారిక సంస్థ ఒక్కటే బలమైన దన్నుగా వుంది. కానీ దానితో కూడా ఇప్పుడు పొరపచ్చాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. అవి సెటిల్ అయితే ఓకె. లేదంటే నైజాంలో దిల్ రాజు సంస్థకు ఇబ్బంది అవుతుంది.

నిర్మాణ పరంగా సరైన ప్రాజెక్ట్ లు కావాలి. అనిల్ రావిపూడి మళ్లీ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి కనీసం ఏడాది పైగానే పడుతుంది. అమీర్ ఖాన్ తో వంశీ పైడిపల్లి సినిమా అనే వార్తలు వున్నాయి. కానీ అమీర్ ఖాన్ తో అంటే చాలా భారీ సినిమా, పైగా టైమ్ పడుతుంది. ప్రభాస్ ఓ సినిమా దిల్ రాజుకు చేయాల్సి వుంది. కానీ ప్రాజెక్ట సెట్ కావాలి.

మరే పెద్ద హీరో ప్రాజెక్ట్ ప్రస్తుతానికి దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. నిజానికి భారీ సినిమాల కన్నా సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమాలే బెటర్. టైమ్ కలిసి వస్తుంది. కాలం కలిసి వస్తే కోట్లకు కోట్లు వస్తాయి. కానీ అలాంటి ప్రాజెక్ట్ లు ప్రతిసారీ దొరకవు. గతంలో ఫిదా దొరికింది దిల్ రాజుకు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం దొరికింది.

ఇకపై ప్రాజెక్ట్ ల విషయంలో చాలా ఆచి తూచి ముందుకు వెళ్లాలని దిల్ రాజు అండ్ టీమ్ భావిస్తోందని తెలుస్తోంది. అంతకు ముందుగా సంస్థను అన్ని విధాలుగా రీ కన్ స్ట్రక్షన్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నింటిలో తనే జోక్యం చేసుకోకుండా, తన అన్న దమ్ములు, వారి పిల్లలు అందరికీ బాధ్యతలు అప్పగించి, తాను పర్యవేక్షణకు పరిమితం కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

చూడాలి ముందు ముందు దిల్ రాజు సంస్థ నుంచి ఏం సినిమాలు రాబోతున్నాయో..ఎలా ఉండబోతోందో?

5 Replies to “దిల్ రాజు.. భారం దిగింది.. వాట్ నెక్ట్స్!”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.