ఉక్కులో ప్రైవేటీకరణ తొలి అడుగులు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 51 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లను తొలగించిన ఉక్కు యాజమాన్యం ప్రైవేటు దిశగా తొలి అడుగులు వేసింది. దీని మీద కార్మిక సంఘాలు ఉక్కు అధికారులను ప్రశ్నిస్తే పై నుంచి ఉత్తర్వులని బదులిచ్చారు. ఇదే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న స్పెషల్ మెయింటెనెన్స్ అలవెన్స్ 2,400 రూపాయలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

దీని మీద ఉక్కు కార్మికులు ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్రం 2021 జనవరి 27న ప్రకటించింది. సరిగ్గా నాలుగేళ్ల తరువాత ఇదే రోజున ఉక్కులో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

విశాఖ ఉక్కుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల పెద్దగా మేలు జరగదని వారు అంటున్నారు. ఉక్కులో ప్రైవేటీకరణ లేదని చెబుతూనే ఇప్పటికి ఆరు వందల మంది దాకా ఉద్యోగులను తొలగించారని వారు ఆరోపించారు.

ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన రైతులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఈ రోజుకీ ఇవ్వలేదని అంటున్నారు. ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా తీసేయడంతో పదహారు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు అంటున్నారు.

విశాఖకు వచ్చిన మంత్రి నారా లోకేష్ ప్రైవేటీకరణ ఉండదని చెబుతున్న సమయంలోనే డ్రైవర్లను తొలగించారని వారు అంటున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు భవిష్యత్తు పోరాట కార్యాచరణ కోసం ఈ నెల 29న అఖిల పక్ష కార్మిక సంఘాల సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 8న కేంద్ర ఉక్కు కార్యదర్శి స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తున్న క్రమంలో ఉక్కు కార్మిక సంఘాలు ఈ ఉద్యమాన్ని రూపొందిస్తున్నాయి.

14 Replies to “ఉక్కులో ప్రైవేటీకరణ తొలి అడుగులు”

  1. జనాలు పన్ను కట్టిన డబ్బు పప్పు బెల్లలలాగా తినేయటమే దీన్ని ప్రైవేట్ చేయకపోతే మనం జనాలు పన్నులు కడతారు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు నష్టాలకు కుంటి సాకులు చెబుతారు అసలు ప్రభుత్వం వ్యాపారం చేస్తే ఎలాగా ఉంటాడో ఇదో పెద్ద ఉదాహరణ

      1. During the initial periods, the company suffered huge losses. Later the profits have gone up by 200% making it the only steel industry to achieve such a target. RINL’s financial condition has been critical, with a net worth of ₹(-)4538.00 crore as of March 31, 2024. 

      2. During the initial periods, the company suffered huge losses. Later the profits have gone up by 200% making it the only steel industry to achieve such a target. The current RINL’s financial condition has been critical, with a net worth of ₹(-)4538.00 crore as of March 31, 2024. 

        1. What about losses of Vodafone and Idea. Government took equity of Vodafone-Idea for the money they had to pay as taxes approx 16000Cr. We are asking for privatisation of steel plant also, but the ground reality is that they are closing it for the sake of gangavaram port and one more upcoming steel plant at Nakkapalli.(Highly doubtful of this steel plant coming up as there is no official statement from Arcellor Mittal yet)

  2. ఒక వెల ప్రవెటీకరణ చెసారు అనె అనుకుందాం? అప్పుడు మాత్రం కార్మికులు అవసరం ఉండదా?

    అయినా మెము ప్రవెటీకరణ చెయటం లెదు… అని కెంద్రం స్పష్టం గా చెప్పి 11,500 కొట్లు డబ్బు కూడా ఇస్తె… ఇప్పుడు నువ్వు అదిగొ, ఇదిగొ ప్రవెటీకరణ అంటూ మొరుగుతావు ఎమిటిరా అయ్యా!

    1. సాక్షికి అక్రమసంతానంగా పుట్టిన బిడ్డలు వీళ్లంతా వీడు, వాయిస్ ఆఫ్ ఆంధ్ర, టీవీ9

      వి6, టెన్ టీవీ, ఎన్టీవీ, వగైరా వగైరా లందరూ జగన్మోచేతి కింద నీళ్లు తాగి తెగ బలిసిపోయారు. వీళ్లంతా ఎప్పుడు ఇలాగే ఏడుస్తూనే ఉంటారు. వీళ్లు ఇలా ఏడవక పోతే అన్నం అరగదు నిద్ర రాదు మరి ఏం చేయమంటారు ? ఎవరి బాధ వాళ్ళది?

  3. Everyone in Gajuwaka wants steel plant to be privatized. They voted unanimously for kootami to make that happen. Why are you worried about it. Why are you talking on behalf of the lazy unions?

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  6. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.