లోకేష్ ప్రమోషన్ పదవిపై కన్నేశారా?

అప్పుడు- ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన మాటలను సింక్ చేసుకుని గమనిస్తే.. ఆయన ప్రమోషన్ కోసం ఆలోచిస్తున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

అప్పుడు- ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన మాటలను సింక్ చేసుకుని గమనిస్తే.. ఆయన ప్రమోషన్ కోసం ఆలోచిస్తున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. పైగా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వడాన్ని చంద్రబాబునాయుడు చాలా రకాలుగా.. సబబైన చర్యగా ప్రజల ఎదుట నిరూపించగలరు కూడా. ఇంతకూ అది ఏం ప్రమోషన్? అనుకుంటున్నారు కదా?

పార్టీ నాయకులు కొందరు ఇటీవలి కాలంలో.. కాస్త అతి చేసి లోకేష్ దృష్టిలో పడడానికి ఆయనను తక్షణం డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ఒక కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన సంగతి అందరికీ తెలుసు. అయితే అలాంటి నాయకులు కొందరు ఈ విషయంలో పార్టీ నియమావళిని అతిక్రమించి మాట్లాడుతున్నట్టుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు కూడా.

అందరికీ నారా లోకేష్ కు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, పవన్ కల్యాణ్ తో సమాన స్థాయిలో ఎప్పుడెప్పుడు గౌరవం దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. అందరి ఆలోచనలను అటువైపు డైవర్ట్ చేసి నారా లోకేష్ మాత్రం.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లేదా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు స్వీకరించబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

కోర్టు పని మీద విశాఖ వెళ్లినప్పుడు నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు విడతలకు మించి ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ఈసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నట్లు కూడా చెప్పారు. ఈ మాటలను చాలా లోతుగా గమనించాల్సిన అవసరం ఉంది. నిజానికి నారా లోకేష్ కొంత కాలంగా ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

గతంలో ఒకవ్యక్తి ఒక పదవిలో రెండుసార్లకు మించి ఉండకూడదని కూడా అన్నారు. రెండుసార్లు ఒక పదవిలో చేసిన తర్వాత పక్కకు తప్పుకుని కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, తద్వారా యువనాయకత్వానికి మెరుగైన అవకాశాలు దక్కుతాయని అన్నారు. అలాగే ఒక పదవిలో రెండు సార్లు చేసిన వారు పైపదవులకు వెళ్లాలని కూడా సెలవిచ్చారు.

అప్పటి మాటలను ఇప్పటి మాటలను సమన్వయం చేసుకుంటే.. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ చేసేశారు. ఇప్పుడు ఈసారి ఆ పదవి వద్దని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. అంటే పై పదవికి వెళ్లాలని ఆశిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొత్త పదవి సృష్టించి దానిని నారా లోకేష్ కు కట్టబెట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

పార్టీ పెత్తనం మొత్తం కొడుకు చేతిలో పెట్టేసి, తాను కేవలం పర్యవేక్షణ బాధ్యత మాత్రం చూడడానికి.. ఇలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెలంగాణ లో కేసీఆర్ ఒక మార్గంలాగా క్రియేట్ చేసి పెట్టారు. అదే బాటలో చంద్రబాబు కూడా నారా లోకేష్ ను ఈ ఏడాదిలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేయవచ్చుననే అంచనాలు ఉన్నాయి.

మరో ట్విస్టు ఏంటంటే.. ఏకంగా జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసే అవకాశం కూడా ఉంది. తనకు రాష్ట్ర సంక్షేమం మాత్రమే ముఖ్యమని, ముఖ్యమంత్రి గురుతర బాధ్యత ఉన్నందున.. పూర్తిస్తాయిలో శక్తియుక్తులు రాష్ట్రం కోసమే వెచ్చించడానికి పార్టీ పదవిని కొడుకు చేతిలో పెట్టేస్తున్నానని చంద్రబాబు చాలా అందంగా ఆ నిర్ణయం గురించి అభివర్ణించగలరు కూడా.!

6 Replies to “లోకేష్ ప్రమోషన్ పదవిపై కన్నేశారా?”

  1. వాళ్ళ పార్టీ లో పదవులకు కూడా నీ పర్మిషన్ కావాలా..?

    లేక.. నీకు నచ్చితేనే పదవులకు అర్హులా..?

    ..

    టీడీపీ, జనసేన రెండూ ప్రజల్లో ఉన్నారు.. పార్టీ ని పెంచుకుంటూ పోతున్నారు.. ఎప్పటికప్పుడు క్యాడర్ ని ఆక్టివేట్ చేసుకుంటూ సాగిపోతున్నారు..

    మరి ఇంకో మబ్బు మొఖం గాడు.. నిద్ర లేచాడో లేదో.. ఇంకా నిద్ర సరిపోలేదనుకుంటా..

    లిస్ట్ రాసిపెట్టుకోండి.. నేను లుంగీ కట్టుకుని వచ్చేస్తే .. అని చెప్పి జంప్ అయిపోతాడు..

    మళ్ళీ శవం కనపడితే గాని మూడ్ లోకి రాలేడు ..

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. పాపం మావోడికి “ప్రతిపక్ష నేత post” ఇచ్చి ప్రమోషన్ ఇవ్వ0డయ్యా.. ఇవ్వకపోతే ఆంధ్రా కి good bye చెప్పి, లండన్ లోనే పెర్మనెంట్ గా ఉండిపోతా అంటున్నాడు. ఇక మీ ఇష్టం

  4. పాపం మావోడికి “ప్రతిపక్ష నేత post” ఇచ్చి ప్రమోషన్ ఇవ్వ0డయ్యా.. ఇవ్వకపోతే ఆంధ్రాకి goodbye చెప్పి, లండన్ ‘లోనే పెర్మనెంట్ గా ఉండిపోతా అంటున్నాడు. ఇక మీ ఇష్టం

  5. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ@

Comments are closed.