మొన్న పెనుకొండ‌, నేడు ధ‌ర్మ‌వ‌రం.. టీడీపీ వ‌యొలెంట్ పాలిటిక్స్!

ఎవ‌రు అడ్డొచ్చినా, ఎవ‌రు అడ్డు క‌నిపించినా ఒక‌టే తీరు అన్న‌ట్టుగా త‌మ్ముళ్ల వ్య‌వ‌హారాలు వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నాయి.

పెనుకొండ‌లో ఒక ఆటోడ్రైవ‌ర్ త‌న ఆటోను స్థానిక ఎమ్మెల్యే క‌మ్ మంత్రి గారి ఫ్లెక్సీ ముందు నిలిపాడ‌ట‌! మా నేత ఫ్లెక్సీ ముందే ఆటోపెడ‌తావా అంటూ స‌ద‌రు నాయకురాలి అనుచ‌రుడు ఆ ఆటో డ్రైవ‌ర్ పై విరుచుకుప‌డ్డాడు. అత‌డు, అత‌డి అనుచ‌ర‌గ‌ణం క‌లిసి ఆ ఆటో డ్రైవ‌ర్ ను విపరీతంగా కొట్టారు. కాళ్ల‌తో త‌న్ని ఈడ్చారు. గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఆ ఆటోడ్రైవ‌ర్ శివ‌మాల‌ధారి.

శివరాత్రి వ‌ర‌కూ రాయ‌ల‌సీమ ప్రాంతంలో శివ‌మాల‌ధారులు ఉంటారు. అయ్య‌ప్ప మాల త‌ర్వాత సీమ‌లో శివ‌మాల ధ‌రించే వారు గ‌ణ‌నీయంగా ఉంటారు. వారికి గౌర‌వం సంగ‌త‌లా ఉంచి… కేవ‌లం ఫ్లెక్సీ ముందు ఆటో ఉంచాడ‌నే ఆగ్ర‌హావేశాల‌తో మాల‌ధారిని కాళ్ల‌తో త‌న్ని దాడికి పాల్ప‌డ్డారు తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లు. స‌ద‌రు తెలుగుదేశం కార్య‌క‌ర్త పేరు దాదూ అని కూడా తెలుస్తోంది. దీనిపై శివ‌మాల‌ధారులు నిర‌స‌న తెలిపారు. ఆ నిర‌స‌న‌లో భాగంగా తెలుగుదేశం నేత‌ల ఫ్లెక్సీల‌ను వారు చించ‌డం, వారిపై పోలీసులు విరుచుకుప‌డ‌టం జ‌రిగింది.

క‌ట్ చేస్తే.. పెనుకొండ ప‌క్క‌నే ఉన్న ధ‌ర్మ‌వ‌రంలో తెలుగుదేశం సంబంధిత మ‌రో హింసాత్మ‌క ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ధ‌ర్మ‌వ‌రంలో ఇన్నాళ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండిన ఒక మైనారిటీ చోటా నేత బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్న నేప‌థ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు అత‌డి ఇంటి మీద‌కు ప‌డి మరీ దాడికి తెగ‌బ‌డ్డార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇన్నాళ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇప్పుడు బీజేపీలోకి చేర‌డం ఏమిటంటూ వారు విరుచుకుప‌డ్డార‌ట‌. దీనికి స‌ద‌రు ఫిరాయింపు నేత కూడా ప్ర‌తిఘ‌టించ‌డంతో ర‌చ్చ‌రంబోలా అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇరు వ‌ర్గాలూ ప‌ర‌స్ప‌రం తీవ్ర‌మైన దాడులు చేసుకున్నారు.

అయినా చేర్చుకునే బీజేపీకి లేని బాధ తెలుగుదేశం పార్టీకి ఎందుకు అనే ప్ర‌శ్న ఇక్క‌డ స‌హ‌జంగానే వ‌స్తుంది. బీజేపీలో చేరాల‌నుకునే వారికి తెలుగుదేశం అనుమ‌తి కావాల‌ని ఈ దాడి ద్వారా ప‌చ్చ పార్టీ స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చిన‌ట్టుగా ఉంది.

ఏతావాతా తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌హారాలు వ‌యొలెంట్ గా కొన‌సాగుతూ ఉన్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ ఈ దాడులు, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు ప్ర‌త్య‌ర్థి పార్టీ వాళ్ల మీదే అన్న‌ట్టుగా ఉండేవి, ఇప్పుడు ఎవ‌రు అడ్డొచ్చినా, ఎవ‌రు అడ్డు క‌నిపించినా ఒక‌టే తీరు అన్న‌ట్టుగా త‌మ్ముళ్ల వ్య‌వ‌హారాలు వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నాయి.

3 Replies to “మొన్న పెనుకొండ‌, నేడు ధ‌ర్మ‌వ‌రం.. టీడీపీ వ‌యొలెంట్ పాలిటిక్స్!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.