గేమ్ ఛేంజర్ చాలా హర్ట్ చేసింది

సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా అనడం వేరు. గేమ్ ఛేంజర్ చూసి నాతో మాట్లాడినవాళ్లెవరూ సినిమా బాగాలేదని చెప్పలేదు.

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషించింది అంజలి. ఆమె కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. అయితే ఆ సినిమా రిజల్ట్ తనను బాగా హర్ట్ చేసిందని చెబుతోంది అంజలి.

“సినిమా బాగుండడం వేరు, మంచి సినిమా అనడం వేరు. గేమ్ ఛేంజర్ చూసి నాతో మాట్లాడినవాళ్లెవరూ సినిమా బాగాలేదని చెప్పలేదు. అంతా మంచి సినిమా అన్నారు. కొన్ని సందర్భాల్లో మనం చాలా హర్ట్ అవుతాం. అలానే ఇది నన్ను చాలా హర్ట్ చేసింది.”

గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్ పై మాట్లాడాలంటే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ పెట్టుకోవాలని, కనీసం 40 నిమిషాలు మాట్లాడాలని అంటోంది అంజలి.

“గేమ్ ఛేంజర్ సినిమాను నేను పర్సనల్ గా బాగా నమ్మాను. 200 శాతం నా కష్టం పెట్టాను. ప్రచారం కూడా చేశాను. ఎవరైనా అంత వరకు మాత్రమే చేయగలరు. నేను కూడా అదే చేశాను. మిగతా విషయాలు మన చేతిలో ఉండవు కదా.”

గేమ్ ఛేంజర్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని.. ఓ మంచి సినిమా చేసిన తృప్తి తనకు దక్కిందని అంటోంది అంజలి.

2 Replies to “గేమ్ ఛేంజర్ చాలా హర్ట్ చేసింది”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.