కల్కి 2 ఇప్పుడే కాదన్న మాటే

కల్కి సినిమాను 2027లో విడుదల చేస్తే, అప్పటికి కల్కి పార్ట్ వన్‌ను అందరూ దాదాపుగా మరచిపోయారేమో?

ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో కల్కి 2 ఒకటి. సలార్ 2 మీద అనుమానం వుందేమో, కానీ కల్కి 2 మీద మాత్రం లేదు. ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ వేరే ప్రాజెక్ట్ ఏమీ పెట్టుకోలేదు. పూర్తిగా కల్కి సిరీస్ మీదనే ఉన్నారు. కానీ అలా అని ప్రభాస్ మాత్రం ఆ సినిమా మీదే లేరు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ మూడు సినిమాలు పూర్తి చేసి రావాలి. మళ్లీ అలా అని నాగ్ అశ్విన్ కూడా రెడీగా లేరు.

నాగ్ అశ్విన్ ఫ్యామిలీ వెకేషన్‌కు కేరళ వెళ్తూ మీడియా కంటపడ్డారు. అప్పుడు కల్కి 2 గురించి అడిగితే “స్టార్ట్ చేయాలి” అన్నారు. “కొద్దిగా ముందుగా తీసిన ఫుటేజ్ ఉంది” అని అన్నారు. కానీ పార్ట్ 2 వర్క్ అంతా చేయాల్సి ఉందని క్లారిటీ ఇచ్చారు.

అంటే కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పట్టడం ఖాయం. అంటే అది 2027లోనో, 2028లోనో వస్తుందేమో? ఎందుకంటే 2025లో రాజా సాబ్, 2026లో ఫౌజీ, స్పిరిట్ ఉండనే ఉన్నాయి. 2027కు కల్కి 2ను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ లెక్కన సలార్ 2ను మరిచిపోవాలేమో?

అయినా కల్కి సినిమాను 2027లో విడుదల చేస్తే, అప్పటికి కల్కి పార్ట్ వన్‌ను అందరూ దాదాపుగా మరచిపోయారేమో? కల్కి 2కి ముందు పార్ట్ వన్‌ను ఓసారి థియేటర్లలో వేసి, ఫ్రీగా చూపించి గుర్తుచేయాలేమో? ఏమిటో ఈ భారీ సీక్వెళ్ల వరస.

2 Replies to “కల్కి 2 ఇప్పుడే కాదన్న మాటే”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.