అల్లుడి కోసం సినిమా హిట్టే…అందులో సందేహం లేదు. ఎందుకంటే 19 కోట్లు వసూలు చేసిన దృశ్యం హిట్ అయితే, 21 కోట్లు వసూలు చేసిన అల్లుడు శీను కూడా హిట్టేగా. అయితే దీని బడ్జెట్, దాని బడ్జెట్ ఇతరత్రా వ్యవహారాల్లోకి తొంగి చూస్తే మాత్రం తేడా చాలా వుంటుదనుకోండి. బెల్లంకొండ మార్కెట్ పబ్లిసిటీ స్ట్రాటజీ కావచ్చు, వినాయక్ మాస్ మంత్ర మహిమ కావచ్చు, అల్లుడు శీను బాగానే ఆడేసినట్లే.
కానీ రభస వాయిదా వేసి మరీ మరిన్ని కలెక్షన్లు తెచ్చుకుందామన్న స్ట్రాటజీ మాత్రం వర్కవుట్ అవుతున్నట్లు లేదు. సికిందర్ రాకుండానే అల్లుడి శీను కలెక్షన్లు డల్ అయ్యాయి. రన్ రాజా రన్, గాలిపటం సినిమాలు అర్బన్ యూత్, బి, సి సెంటర్ల యూత్ ను ఇటు డైవర్ట్ చేసాయి. ఇక గీతాంజలి కూడా కాస్త అడ్డుకుంది. దీంతో ఈ వారం ఈ మూడూ ఓ చూపు చూస్తే, వచ్చేవారానికి సికిందర్ వచ్చి పడుతుంది. అంటే మొత్తం నాలుగు సినిమాలు.
అంటే ఇంక అల్లుడి శీను సెకెండ్ సెంటర్లపై డిపెండ్ కావాల్సిందే. పాతిక కోట్లు కలెక్ట్ చేయాలి. 50 రోజుల సెంటర్ల జాబితా వేయాలి అన్న కోరిక తీరుతుందో లేదో మరి. ఎందుకంటే పైరసీ సమస్య ఒకటి వుండనే వుంది కదా..అందువల్ల ఫ్యామిలీలు రావు..రిపీట్ చూసేంత 'సీను' కాదు అల్లుడు శీను. మరి బయ్యర్లకో, బెల్లంకొండకో కనీసం అయిదు నుంచి పది కోట్ల వరకు పోతున్నట్లే మరి.