కొడుకు శీను తో రెండు మాస్ సినిమా తీయడానికి రంగం సిద్దం చేసేస్తున్నాడు బెల్లంకొండ. అప్పుడే డైరక్టర్ గా బోయపాటిని ఓకె చేసేసుకున్నాడు. ఈ సినిమాకు బోయపాటికి ఏకంగా ఏడు కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గా శృతి హాసన్ ను లాక్ చేసాడు. కోటిన్నర అన్నది ఆఫర్ అమౌంట్ అని వినికిడి. సంగీతానికి మళ్లీ దేవీ నే ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లెజెండ్ ఫంక్షన్ లో బోయపాటి మాటలకు కాస్త అఫెండ్ అయిన దేవీ మరి అంటాడో అనడో..అవసరమైతే సర్దుబాటు చేయగల సమర్థుడే బెల్లంకొండ. అయితే ఈ సారి కథ, మాటల విషయంలో బోయపాటిది సోలో ఫెర్ ఫార్మెన్సే నట,. అందుకే అంత మొత్తం అని కూడా వినికిడి. అవును ఇంతకీ ఈసారి స్పెషల్ సాంగ్ కు ఎవర్ని పట్టుకొస్తారో? కాజల్ నా? దమ్ములో ముగ్గురి చేత స్పెషల్ సాంగ్ చేయించినవాడు బోయపాటి. అందువల్ల ఏదోఒకటి చేసి, ఎవర్నో ఒకర్ని సెట్ చేసినా చేయగలడు.