Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'అల్లుడు'కి రావిపూడి సాయం!

'అల్లుడు'కి రావిపూడి సాయం!

మరో కొద్ది రోజుల్లో అల్లుడు అదుర్స్ సినిమా స్క్రీన్ మీదకు రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ మీద నడిచే సినిమా. ఇండస్ట్రీలోని టాప్ లైన్ కమెడియన్స్ అంతా దాదాపుగా ఈ సినిమాలో వున్నారు.  

కేవలం ఫన్ టోన్ లోనే కథను, మిగిలిన కమర్షియల్ అంశాలను ఇమిడ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సినిమాకు ఎంటర్ టైన్ మెంట్ ను స్క్రీన్ మీద పండించడంలో అనుభవం పండించుకున్న డైరక్టర్ అనిల్ రావిపూడి గైడెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మొత్తం సినిమా అవుట్ ఫుట్ రెడీ అయిన తరువాత అనిల్ రావిపూడి చూసారని, మరి కొన్ని ఇంప్రూవైజేషన్ సజెషన్ లు ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా బెల్లంకొండ సాయి సినిమాలకు దర్శకుడు వివి వినాయక్ గైడెన్స్ కచ్చితంగా వుంటుంది. ఈసారి ఆయనతో పాటు, టాప్ లైన్ డైరక్టర్ అనిల్ రావిపూడి కూడా తోడైనట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పండగకు పెర్ ఫెక్ట్ ఫ్యామిలీ సినిమాగా అల్లుడు అదుర్స్ కు బజ్ వచ్చింది. అనిల్ రావిపూడి చేయి వేసారు అంటే కచ్చితంగా బజ్ పూర్తిగా టాక్ గా మారే అవకాశం వుందనుకోవాలి

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?