శైలజారెడ్డి అల్లుడు సినిమా విడుదల దగ్గరకు వస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ హడావుడి వుండనే వుంటుంది. ఏడు లేదా తొమ్మిది తేదీల్లో ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయాలని గతంలోనే డిసైడ్ అయ్యారు. అప్పట్లో ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా, తివిక్రమ్ గెస్ట్ గా వుంటారని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పడు డేట్ అయితే తొమ్మిది అని ఫిక్స్ చేసుకున్నారు. అంతవరకు ఓకె.
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో అనుకోని దుర్ఘటన జరిగింది.అందువల్ల ఆయన పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చే అవకాశం దాదాపు వుండకపోవచ్చు. పైగా రమ్మనమని అడగలేరు కూడా. అస్సలు బాగోదు. ఇంకె వేరేవర్ని పిలవాలన్నా అందుబాటులో ఎవ్వరూలేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక షూటింగ్ అంటూ ఎక్కెడెక్కడో వున్నారు. లోకల్ గా వున్నవాళ్లంతా కూడా ఫుల్ బిజీగా వున్నారు.
అందువల్ల ఇప్పుడు చీఫ్ గెస్ట్ అన్నదే సమస్యగా మారింది. ఆఖరికి ఎప్పటిలాగా కొడుకు సినిమా కోసం నాగార్జున మాత్రమే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ లా కనిపిస్తోంది. లేదూ అంటే మారుతి అడగాలే కానీ, చిరంజీవి, అరవింద్ లు మాత్రం కదిలి వస్తారు. మరేం చేస్తారో చూడాలి.