అల్లుడు శీను అసలు లెక్కలేమిటి?

బెల్లంకొండ సురేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా అల్లుడు శీను. పది పదిహేను కోట్లు పోయినా ఫరవాలేదు..తన కొడుకును ఓ స్థాయిలో ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. అందుకు తగ్గ వనరులు అన్నీ సమకూర్చుకున్నాడు. ఇందుకు నలభై…

బెల్లంకొండ సురేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా అల్లుడు శీను. పది పదిహేను కోట్లు పోయినా ఫరవాలేదు..తన కొడుకును ఓ స్థాయిలో ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. అందుకు తగ్గ వనరులు అన్నీ సమకూర్చుకున్నాడు. ఇందుకు నలభై కోట్లు అయిందని కొందరు..కాదు నలభై రెండు అని మరికొందరు అంటున్నారు. సమంతకు రెండు కోట్లు ఇచ్చారని టాక్ వచ్చింది. కాదు..అభిమానంతో చేసా అంటోందా అమ్మాయి. వినాయక్ కు ఏకంగా ఇల్లే ఇచ్చారని మరో టాక్. పబ్లిసిటీకే 6 నుంచి 7 కోట్లు ఖర్చు చేసారని ఇంకో మాట.

ఇంతకీ అసలు లెక్కలేమిటి? అన్నది ఆరా తీస్తే..విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, అల్లుడి శీనుకు ఫబ్లిసిటీతో సహా అయిన ఖర్చు 36 కోట్లు. ఇందులో హీరోకి రెమ్యూనిరేషన్ లేదు. దర్శకుడు వినాయక్ కు స్థలం రూపేణా లేదా, ఇంటి నిర్మాణ రూపేణా ముట్టింది 12 కోట్లు అని తెలుస్తోంది. సమంతకు ఇచ్చింది కోటి ఇరవై అయిదు లక్షలు. ఇక ఐటమ్ సాంగ్ చేసిన తమన్నాకు ఇచ్చింది ఎనభై లక్షలు. పబ్లిసిటీకి ఖర్చు చేసింది అయిదు నుంచి ఆరు కోట్లు. ఇవీ అసలు లెక్కలని తెలుస్తోంది. 

అయితే ఇప్పటికి అల్లుడి శీను బాగానే వసూళ్లు సాగించింది. 15 కోట్ల వరకు వచ్చాయి. మరో అయిదు వరకు ఖాయం అని టాక్. అంటే ఇరవై కోట్లు. ఈ వారం రన్ రాజా రన్ తో  శీను కలెక్షన్లు సడెన్ గా డ్రాప్ అయ్యాయి. అయినా ఈవారం వచ్చేవారం కలెక్షన్లు ఏ మాత్రం బాగున్నా 20 దాటే అవకాశం వుంది. ఆపై రభస వస్తుంది కాబట్టి ఇక అంతలా వుండకపోవచ్చు. అంటే 36 కోట్ల  పెట్టుబడికి దగ్గర దగ్గర 20 నుంచి 25 మధ్యలో వసూళ్లన్నమాట. ఖర్చుతో చూసుకుంటే నష్టమే. కానీ ఓ కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు అంటే అది పబ్లిసిటీతో సాధించిన ఘనతే. బెల్లంకొండ ఓ పది కోట్లతో తన కొడుకును భారీగా లాంచ్ చేసుకున్నట్లు లెక్క వేసుకోవాలి. అంతే. 

ఇంతకీ కొసమెరుపు ఏమిటంటే, సినిమా అంతా నటించి, వీలయినంత ఎక్స్ పోజ్ చేసి, అడియో ఫంక్షన్ లో కూడా ఆడి పాడిన సమంతకు కోటి పాతికి లక్షలు. కేవలం ఓ అయిటమ్ సాంగ్ లో తళుక్కున మెరిసిన తమన్నాకు ఎనబై లక్షలు. తమ్మూ పనే బాగుంది.

'చిత్ర'గుప్త