అల్లూరిగా చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్

దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ వెల్లడించేసారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కథల్లోని ఓ కామన్ పాయింట్ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లూరి, కొమరం భీమ్ జీవితాల్లో చాలా సారూప్యాలు…

దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథ వెల్లడించేసారు. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కథల్లోని ఓ కామన్ పాయింట్ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లూరి, కొమరం భీమ్ జీవితాల్లో చాలా సారూప్యాలు వున్నాయని, ఇద్దరూ యంగ్ ఏజ్ లో కొన్నాళ్ల పాటు మాయం అయ్యారని, ఆ తరువాత మాంచి విజ్ఞానంతో తిరిగి వచ్చారని, ఆ తరువాత ఉద్యమబాట పట్టి, యంగ్ ఏజ్ లో మరణించారని వివరించారు.

అయితే ఇద్దరు అలా ఎర్లీ ఏజ్ లో మాయం అయినపుడు కలిసివుంటే, ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుని వుంటే.. ఒకరి వల్ల ఒకరు ప్రభావితం అయి వుంటే అన్న ఆలోచనలోంచి పుట్టిన కథే ఆర్ఆర్ఆర్ అని రాజమౌళి వెల్లడించారు. 1920 కాలంలో ఉత్తరభారతంలో జరిగిన కథ కాబట్టి బోలెడు రీసెర్చి చేయాల్సి వుందని అన్నారు. అప్పటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించేలా వుంటుందని అన్నారు.

సినిమాలో యంగ్ అల్లూరిగా చరణ్, యంగ్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపిస్తారని వివరించారు. ఆలియాభట్, అజయ్ దేవగన్, సుముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తారని ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్లలో అజయ్ దేవగన్ కనిపిస్తారని చెప్పారు.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!