తమ్ముడి సినిమాతో దూరం.. అన్నతో రీఎంట్రీ

2017లో వచ్చిన కాటమరాయుడు సినిమా తర్వాత మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు శృతిహాసన్. అలా పవన్ కల్యాణ్ సినిమాతో మాయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. అవును.. అన్నీ అనుకున్నట్టు…

2017లో వచ్చిన కాటమరాయుడు సినిమా తర్వాత మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు శృతిహాసన్. అలా పవన్ కల్యాణ్ సినిమాతో మాయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి-కొరటాల సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది.

నిజానికి కాటమరాయుడు ఫ్లాప్ వల్ల శృతిహాసన్ గ్యాప్ తీసుకోలేదు. ఆమె కావాలని తీసుకున్న నిర్ణయం అది. మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయడంతో పాటు, ప్రియుడు మైఖేల్ కోర్సల్ తో, కుటుంబంతో సమయం గడపాలనే ఉద్దేశంతో ఆమె గ్యాప్ తీసుకుంది.

అలా రెండేళ్లు వెండితెరకు దూరమైన శృతిహాసన్, తాజాగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పింది. ఇప్పుడు తెలుగు, తమిళ భాషలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే చిరంజీవి సినిమా ఆఫర్ కూడా శృతిహాసన్ చెంతకు వచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో శృతిహాసన్ తో శ్రీమంతుడు సినిమా చేశాడు దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి సరసన కూడా ఆమె అయితే బాగుంటుందని భావించి సంప్రదించాడట. ప్రస్తుతానికైతే కథా చర్చలు ముగిశాయి. శృతిహాసన్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు.

ప్రస్తుతం ఆమె చేతిలో హిందీ సినిమా మాత్రమే ఉంది. తండ్రి కమల్ చేయాల్సిన శభాష్ నాయుడు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవరికీ తెలీదు. కాబట్టి ఆమె చిరంజీవి సినిమాకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!