Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ 30 జూలై 2020

ఆర్ఆర్ఆర్ 30 జూలై 2020

మోస్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ టాలీవుడ్ అని ఇప్పుడు అనుకుంటున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల డేట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ ను జూలై 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. సినిమా నిర్మాణ వ్యయం 350 నుంచి 400 కోట్ల వరకు వుంటుందని తెలిపారు. ఈరోజు జరిగిన ఆర్ఆర్ఆర్ మీట్ లో నిర్మాత దానయ్య ఈ విషయాలు వెల్లడించారు. 

ఇదిలావుంటే రామ్ చరణ్ కొత్త గెటప్ లో ఆర్ఆర్ఆర్ మీట్ లో కనిపించారు. తక్కువ హెయిర్ తో క్లీన్ షేవ్ తో, కాస్త పొడవు మీసంతో, ఓ ఆర్మీ పర్సన్ గా డిఫరెంట్ గా కనిపించారు. ఎన్టీఆర్ మాత్రం జనాలకు అలవాటైన లుక్ లోనే కనిపించారు. గుబురు గడ్డంతో ఆయన వచ్చారు.

ఇద్దరి లుక్ లు ఎక్కువగా రివీల్ కాకూడదనే ఉద్దేశంతో కావచ్చు, ఫోటోలు తీస్తారనే కావచ్చు ఇద్దరూ టోపీలు పెట్టుకోవడం విశేషం.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?