ఒక్కో హీరోకి, ఒక్కో డైరక్టర్ కు ఒక్కో హీరోయిన్ అంటే ఇంట్రస్టో, సెంటిమెంటో, మరోటో వుంటుంది. అందువల్ల వాళ్ల జోడీ రిపీట్ అవుతుంటుంది. వినాయక్-నయనతార కాంబినేషన్ అలాంటిదే. హిట్ కాంబినేషన్. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి మెగాస్టార్ 150 సినిమాలో రిపీట్ కాబోతోందని అంటున్నారు.
అయితే చిన్న హర్డిల్..నయనతార రెమ్యూనిరేషన్ కాస్త భారీగా వుందని. భారీ అంటే ఏమంత భారీ కాదు. జస్ట్ రెండున్నర కోట్లు. దానికే నిర్మాత సీట్లో వున్న చరణ్ జంకేసాడని, ఆల్టర్ నేటివ్ చూస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి. తండ్రి మెగాస్టార్ కు ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసాడని వార్తలు వచ్చాయి.
మరి హీరోకి ముఫై కోట్లు ఇచ్చిన వాడు, అందులో టన్ పర్సంట్ అయినా హీరోయిన్ కు ఇవ్వలేడా? పైగా నయన ఎక్కడా లేని రేటు అడగలేదు కదా? వెంకీ-మారుతి సినిమాకు కూడా అలాగే తీసుకుంది కదా. పైగా ఇప్పుడు నయనతారను వద్దంటే వినాయక్ ఫీల్ కాడా? తమ హిట్ సెంటిమెంట్ కాంబినేషన్ మిస్సవుతుందని. అందువల్ల నయనతారకు నో ఆల్టర్ నేటివ్..ఫిక్స్ అంతే.