బాబాయ్.. అబ్బాయ్ అంటూ నానా హడావుడి జరిగిపోతోంది మీడియాలో. కానీ మరోపక్క ఆ విషయాలపైనే మాట్లాడనంటున్నాడు అబ్బాయ్. నాన్నకు ప్రేమతో విడుదల సందర్భంగా ఎన్టీఆర్ శనివారం ఉదయం ప్రింట్ మీడియాతో మాట్లాడాడు. మీడియా జనం పదే పదే అడిగినా, ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడడనని, ఏమైనా వుంటేగా అసలు మాట్లాడడానికి అని నిరాకరించాడు.
మరి నిప్పు లేనిదే పొగరాదన్నట్లు, ఏమీ లేనిదే ఇంత హడావుడి ఎందుకు జరుగుతుంది? పోనీ అలా అబ్బాయి ఏమన్నా బాబాయ్ ఫంక్షన్ లకు వెళ్తున్నాడా? ఏదీ..ఏ గొడవులు లేవని చాటడానికి ఈ సాయంత్రం బాబాయ్ సినిమా అడియో ప్లాటినమ్ ఢిస్క్ ఫంక్షన్ కు వెళ్లవచ్చుగా..మామధ్య ఏమీ లేదు..మీడియాలో ఈ రగడ వద్దు అని చెప్పవచ్చుగా?
పైగా నాలుగు సినిమాలు ఆడాలి…ఆడతాయి..ఎన్ని సినిమాలు వచ్చినా జనం చూస్తారు..లాంటి పెద్ద తరహా కబుర్లు ఒకటి. అదే నిజమైతే ఇన్నాళ్లు టాలీవుడ్ లో సోలోగా రావాలి..సోలోగా రావాలి అన్న తహతహ ఎందుకో అందరికీ? పోనీ అన్ని సినిమాలు ఆడాలి అన్నంత పెద్ద మనసు వున్నపుడు తన సినిమాను వెనక్కో, ముందుకో జరుపుకోవచ్చుగా?
అంతే..చెప్పడానికి ఏమీ వుండదు..సుద్దులు తప్ప.