పూరి తన సిబ్బందికి ఇదే ఆఖరు..ఇంక మీరు నేనుకలిసి పనిచేయడం వుండకపోచవ్చంటూ ఆ మధ్య మెసేజ్ లు పెట్టాడు అని కొద్ది రోజుల క్రితమే వెల్లడించాం. ఇప్పుడు ఏకంగా మొత్తం సిబ్బందిని ఫైర్ చేసాడని వెల్లడయింది. ఇంతా పూరి ఎందుకు చేస్తున్నట్లు అన్న దానిపై టాలీవుడ్ లో రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ చార్మి వ్యవహారం వివాదాస్పదంగా పదే పదే మీడియాకు ఎక్కడానికి ఈ సిబ్బందే కారణం అని పూరి భావిస్తున్నట్లు వినికిడి. పూరి వ్యవహారం చాలా లిబరల్ గా వుంటుంది. ఆయనకు పని జరిగిపోతే చాలు పెద్దగా ఏవీ పట్టించుకోడు.
ఈ తరహా వర్క్ కల్చర్ కు అలవాటు పడిన పూరి స్టాఫ్, ఒక్కసారికి చార్మి ఆడ్మినిస్ట్రేషన్ ను డైజస్ట్ చేసుకోలేకపోయారని వినికిడి. దాంతో వారు చిలవలు పలవులు చేర్చి, ఎవరికి వారు తమ తమ మార్గాల ద్వారా మీడియాకు చేర్చారు. దీంతో పూరి-చార్మి వ్యవహారం గతంలో ఎలా వున్నా, ఇప్పుడు మొత్తం రట్టయిపోయింది. దీంతో చార్మిని బయటకు పంపేసినట్లు పూరి కలరింగ్ ఇవ్వక తప్పలేదు. అయితే అది కూడా మళ్లీ బయటకు వచ్చింది. చార్మి ఆఫీసులో కూర్చోకుండానే మోనిటర్ చేస్తోందని బయటకు వచ్చింది.
దీంతో అసలు సిబ్బంది మొత్తాన్ని సమూలంగా ప్రక్షాళన చేయక తప్పని పరిస్థితి పూరికి ఏర్పడిందని వినికిడి. అయితే ఇది ఒక్కటే కారణం కాదు, చేతిలో సినిమాలు లేకుండా ఇంతమంది సిబ్బందిని మెయింటెయిన్ చేయడం కష్టం కాబట్టి, తొలగించాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైనా పూరి టైమ్ ఇప్పుడు అంతగా బాగున్నట్లు లేదు..