cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

రాజశేఖర్ సరసన మెగా హీరోయిన్?

రాజశేఖర్ సరసన మెగా హీరోయిన్?

కల్కి తర్వాత మరో సినిమాతో రెడీ అవుతున్నాడు హీరో రాజశేఖర్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఇది ఓ కన్నడ సినిమాకు రీమేక్ అయినప్పటికీ మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని అధికారికంగా చెప్పడంలేదు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజశేఖర్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటించనుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కానుంది.

అమలాపాల్ కు మెగా హీరోయిన్ అనే ఇమేజ్ ఉంది. గతంలో రామ్ చరణ్, బన్నీ సరసన నటించిందీమె. చరణ్ సరసన నాయక్, బన్నీతో ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసింది. రీసెంట్ గా ఆమె తెలుగులో నటించడం మానేసింది. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే పలకరిస్తోంది. రాజశేఖర్ సినిమా ఆమెకు దాదాపు టాలీవుడ్ రీఎంట్రీ లాంటిదే.

రీసెంట్ గా అమలాపాల్ చేస్తున్న సినిమాలు గమనిస్తే ఓ విషయం అర్థమౌతుంది. ఆమె గ్లామర్ హీరోయిన్ పాత్రలు చేయడం తగ్గించేసింది. 3 పాటలు, 2 ముద్దుసీన్లు టైపు పాత్రలు ఒప్పుకోవడం లేదు. రీసెంట్ గా అమలాపాల్ చేసిన "ఆమె" సినిమా తమిళనాట ప్రశంసలు సైతం అందుకుంది. సో.. రాజశేఖర్ సినిమాలో ఆమెకు ఏదో బలమైన పాత్రనే ఆఫర్ చేసి ఉంటారు. 

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం