దసరాకే ‘అల’ టీజర్

అల వైకుంఠపురములో… బన్నీ-త్రివిక్రమ్ కాంబో సినిమా. సంక్రాంతికి విడుదల. ఈ సినిమా టీజర్ త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా వస్తుందని గ్యాసిప్ వచ్చింది. బర్త్ డే వుందీ అంటేచాలు, ఆ డైరక్టర్ దో, హీరోదో…

అల వైకుంఠపురములో… బన్నీ-త్రివిక్రమ్ కాంబో సినిమా. సంక్రాంతికి విడుదల. ఈ సినిమా టీజర్ త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా వస్తుందని గ్యాసిప్ వచ్చింది. బర్త్ డే వుందీ అంటేచాలు, ఆ డైరక్టర్ దో, హీరోదో సినిమా వుంటే, దాని టీజర్ నో, లుక్ నో వస్తుందని కథ అల్లేయడం కామన్ అయిపోయింది.

అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, అల వైకుంఠపురములో సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఏదయినా కూడా ముందుగా దసరాకు విడుదల చేస్తారన్నది. వాస్తవానికి అంతకన్నా ముందే విడుదల చేసి, సైరా థియేటర్లలో ప్రదర్శించాలని ఆలోచన చేసారు. కానీ టీజర్ రెడీ అవుతుందో కాదో అన్న ఆలోచనతో, విజయదశమి రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.

అల వైకుంఠపురములో కన్నా ముందు విడుదలవుతున్న భీష్మ కూడా ఆ సంస్ధ నుంచి వస్తున్నదే. అయితే అల వైకుంఠపురములో టీజర్ ఇచ్చిన తరువాత గ్యాప్ ఇచ్చి భీష్మ టీజర్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు బోగట్టా. బన్నీ-పూజా హెగ్డే కాంబినేషన్ లో హారిక హాసిని నిర్మించే అల వైకుంఠపురములో సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం